వకీల్‌సాబ్‌గా సునీల్.. మరో విలక్షణ పాత్రలో మర్యాద రామన్న..
Sunil As Lawyer: సునీల్ కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అంతేకాదు మనోడికి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ కోవలో తెలుగులో తెరకెక్కుతోన్న ‘డ్యూడేట్’ మూవీలో వకీల్ సాబ్ పాత్రలో అలరించడానికి రెడీ అవుతున్నారు.
Sunil New Avatar As Vakeelsaab: లోమేష్ పుడిపెద్ది కథానాయకుడిగా.. జయశ్రీ కథానాయికగా నటిస్తోన్న చిత్రం ‘డ్యూడేట్’. కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఆనంద్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అంతేకాదు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కంటిన్యూస్‌గా జరుగుతోంది.
తొలి షెడ్యూల్లో ఇంపార్టెంట్ సీన్స్‌ను పిక్చరైజ్ చేశారు మేకర్స్. రీసెంట్గా కమెడియన్ కృష్ణభగవాన్ 'డ్యూ డేట్' షూటింగ్లో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. చాలా గ్యాప్ తరువాత కృష్ణ భగవాన్ ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే అవకాశాలున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్లో నటుడు సునీల్ జాయిన్ అయ్యారు.
ఈ చిత్రంలో సునీల్ వకీల్‌సాబ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్‌ల్ ఇదొక డిఫరెండ్ క్యారెక్టర్‌గా నిలిచిపోనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటుడు సునీల్ పవర్ఫుల్ లాయర్ శేఖర్ చంద్రగా కనిపించబోతున్నాడట. ఈయన క్యారెక్టర్ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా ఉండనుంది. ప్రజెంట్ సొసైటీలో జరగుతున్న బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రాబోతుంది.
కోర్టు ఇచ్చే డేట్ల ఆధారంగా ఈ సినిమాకు ‘డ్యూ డేట్’ అనే పేరు ఖరారు చేశారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రాబోతుంది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను అందించండతో పాటు అందరిని ఆలోచింపజేస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, కృష్ణ భగవాన్, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, అక్షర గౌడ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జవ్వాడి నాయుడు ఆర్ట్ అందిస్తున్నారు. హరీష్ మీనన్ మాటలు,సత్య గిడుటూర్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెంచు జింక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా.. పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.