SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Irumudi Movie: ‘ఇరుముడి’ సినిమాకు లీగల్ ట్రబుల్స్.. రంగంలోకి దిగిన తెలంగాణ కార్మిక శాఖ..!

Irumudi Movie Controversy: మాస్ మహారాజా రవితేజ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘ఇరుముడి’ మరోసారి వివాదంలో పడింది. సినిమాలో నటించిన మైనర్ బాలిక విషయంలో బాల కార్మిక చట్టాల నిబంధనలను పాటించారా లేదా అనే అంశంపై తెలంగాణ కార్మిక శాఖ చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 31, 2026, 08:54 PM IST | Updated: Oct 31, 2026, 08:56 PM IST
Image Credit: Irumudi Movie (Source: AI)
Join

Irumudi Movie Controversy: మాస్ మహారాజా రవితేజకు చాలాకాలం తర్వాత భారీ విజయాన్ని అందించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అన్ సీజన్‌లో వచ్చినా.. వసూళ్లలో మాత్రం రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన వ్యవహారంపై తెలంగాణ కార్మిక శాఖ నిర్మాతలకు నోటీసులు జారీ చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

‘జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం’ చేసిన ఫిర్యాదు ఆధారంగా కార్మిక శాఖ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను షూటింగ్‌లో భాగం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా..? తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పొందారా..? అనే వివరాలను తెలంగాణ కార్మిక శాఖ అధికారులు కోరారు. అంతేకాకుండా బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ కారణంగా ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న జాగ్రత్తలపై కూడా వివరణ కోరారు.

బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా లేదా అనే అంశంపైనా కార్మిక శాఖ ఆరా తీసింది. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బాలిక పాల్గొన్న విషయంలోనూ నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నిర్మాతలను అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ తొలి రోజు నుంచే మంచి వసూళ్లను రాబట్టింది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే భిన్నమైన పాత్రలో కనిపించడం, తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప దీక్ష నేపథ్యంలో రూపొందించిన కథ, కుటుంబ భావోద్వేగాలు, అమ్మాయిల భద్రతపై బలమైన సామాజిక సందేశం, ద్వితీయార్థంలో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రవితేజ నటన, బేబీ నక్షత్రతో ఆయన పంచుకున్న భావోద్వేగ సన్నివేశాలు ఆడియన్స్‌ను కంటతడి పెట్టించాయి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES