Jo Jo Caution 1: కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
వీడియో గ్లింప్స్..
తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ విషయానికొస్తే.. రాయలసీమలోని జొన్నగిరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వర్షాలు పడినప్పుడు రాయలసీమలో వజ్రాలు దొరుకుతాయనే వార్తలు మనం వింటూనే ఉంటున్నాము. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూరల్ లవ్ స్టోరీగా కామెడీ టచ్‌తో మేకర్స్ ‘జో జో’ సినిమా రాబోతుంది.
ఈ కాషన్ వీడియో గమనిస్తే.. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే క్యాప్షన్‌తోనే ఇది స్టార్ట్ అవుతుంది. వర్షం పడిన తర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొందరు వజ్రాలను వెతుకుతుంటారు. హీరోయిన్‌కు ఓ రాయి దొరకుతుంది. ఆమెను ప్రేమించే హీరో ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె అతడ్ని ఓ బూతు మాటతో నోరు మూయించేస్తుంది. ఆ మాట విని హీరోతో పాటు.. అక్కడున్న హీరో ఫ్రెండ్ కూడా షాకవుతాడు. అయితే హీరో దాన్ని కూడా మోటు సరసం అంటూ కవర్ చేయటం.. చూస్తే నవ్వు తెప్పిస్తుంది.
రా రస్టిక్ రొమాంటిక్ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాషన్ వన్ వీడియోతో సినిమాపై మేకర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే ఇవ్వనున్నట్టు తెలిపారు.