• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

Vijayawada Bypass Tragedy Accident Four Spot Dead: విజయవాడలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బైపాస్‌ రోడ్డులో రెయిలింగ్‌ను ఎలక్ట్రిక్‌ కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 12, 2026, 07:19 PM IST|Updated: Oct 12, 2026, 07:29 PM IST
joinshare
Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి
Image Credit: Vijayawada Car Accident

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

2

Srikanth Daughter Medha: శ్రీకాంత్ కుమార్తె మేధ హీరోయిన్‌గా ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

3

Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

4

AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

5

పవన్ కళ్యాణ్@30ఇయర్స్ ఇండస్ట్రీ.. అల్లు అరవింద్ సహా ప్రముఖుల ప్రశంసలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijayawada Bypass Accident: రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన అనంతరం వెంటనే మంటలు చెలరేగిపోవడంతో కారులోని ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. మంటల్లో చిక్కుకుని నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన విజయవాడ బైపాస్‌పై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్‌ రోడ్డులో విండ్సర్‌ ఎలక్ట్రిక్‌ కారు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్తోంది. డివైడర్‌ను ఢీకొని కారు పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారులోని నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతులు నున్న, నంబూరు వాసులుగా గుర్తించారు.

మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, మృతుల్లో మరో చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నారని తెలుస్తోంది. నంబూరులో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి ప్రయాణం చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్ని బాధిత కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Vijayawada
Telugu News
Andhra Pradesh
AP News