• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /The Paradise Twitter Review: 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది.. తెలంగాణ కథకు థియేటర్లు దద్దరిల్లాయి

The Paradise Twitter Review: 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది.. తెలంగాణ కథకు థియేటర్లు దద్దరిల్లాయి

Srikanth Odela Another Blockbuster With Nani The Paradise Movie Here Twitter Review: థియేటర్‌లలో 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది. తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోందని తెలుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకులు పంచుకుంటున్న అభిప్రాయాల ప్రకారం 'ది ప్యారడైజ్‌' రివ్యూ ఇలా ఉంది.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 23, 2026, 11:26 PM IST|Updated: Sep 23, 2026, 11:31 PM IST
joinshare
The Paradise Twitter Review: 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది.. తెలంగాణ కథకు థియేటర్లు దద్దరిల్లాయి

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Srikanth Odela Blockbuster: భారీ అంచనాలు నెలకొన్న 'ది ప్యారడైజ్‌' సినిమా ప్రీమియర్స్‌ బుధవారం సాయంత్రం థియేటర్‌లలో పడ్డాయి. ప్రత్యేక షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతివ్వడంతో తెలంగాణ, ఏపీలో 'ది ప్యారడైజ్‌' హంగామా మొదలైంది. తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వంలో నటుడు నాని నటించిన ది ప్యారడైజ్‌ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి ఉందని ప్రీమియర్స్‌లో సగటు ప్రేక్షకుడి నుంచి వస్తున్న మాట. ఇక ఎక్స్‌ వేదికగా పలువురు సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అయితే ది ప్యారడైజ్‌ సినిమాకు సంబంధించిన క్లిప్స్‌ వైరల్‌గా మారాయి.

నాని నటించిన 'ప్యారడైజ్' సినిమా ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. సినిమా చూస్తున్న వారు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నారు. నాని ఇంట్రడక్షన్ ఫైట్, మోహన్ బాబు ఎంట్రీ, 'ఆయా షేర్' సాంగ్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ (బీజీఎం) అదిరిపోయిందని పలువురు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరికొందరు ఈ సినిమాపై మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.

Apsara Rajahmundry 🔥 #TheParadise pic.twitter.com/7ohmaAvUNq

— Daya Arjun (@DayaArjun2) September 23, 2026

 ఇక సినిమాలో నాని స్టెప్స్‌ థియేటర్‌లో ప్రేక్షకులను సీట్లపై కూర్చోనివ్వలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా ఆయా షేర్‌తోపాటు ఏషనాగుల కట్ట మీద పాటలకు థియేటర్‌లలో ప్రేక్షకులు స్టెప్పులు వేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. తెలంగాణ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలంగాణకు సంబంధించిన ప్రముఖ కవి, గాయకుడు గద్దర్‌ను చిత్రబృందం స్మరించుకుంది. మరికొందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉండగా.. వివాదం రేగుతుందని భావించిన చిత్రబృందం ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది.

Maddddd 🥵🥵🥵❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥#TheParadise pic.twitter.com/mGfFmVvLAA

— Rūdrã (@Rudragadu) September 23, 2026

సినిమాకు కథ ప్రధాన బలం అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు పంచుకుంటున్న అభిప్రాయాల ఆధారంగా చెప్పవచ్చు. ఓదెల శ్రీకాంత్‌ తాను నమ్మిన కథను వెండితెరపై దించేశాడని.. అతడి దర్శకత్వ ప్రతిభ ఏమిటో మరోసారి సినీ పరిశ్రమకు చూపించాడని తెలుస్తోంది. దసరా సినిమాతో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌.. ఇప్పుడు రెండో సినిమాను అంతకుమించి హిట్‌ సాధించాడని అర్థమవుతోంది.

Paisa vasool fight scene 🔥🔥🥵#TheParadise #Nani pic.twitter.com/4ivHZveJxy

— REBEL TERRITORY❤️‍🔥🗡️ (@prabhas_anna_11) September 23, 2026

ఇక సినిమాకు నాని ప్రాణం పోసి నటించాడని.. నటనలో మరో మెట్టు ఎదిగాడని సినిమా చూస్తే అర్థమవుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు. దసరా సినిమాను మించి నాని ఈ సినిమాలో నటించాడని తెలుస్తోంది. కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌తో మెరవడం ఆకట్టుకుంది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం పాటలు. తెలంగాణ రచయిత కాసర్ల శ్యామ్‌ రాసిన పాటలు.. డైలాగ్‌లు థియేటర్‌లలో పూనకాలు వచ్చేశాయని టాక్‌. ఆయా షేర్‌, ఏశనాగుల పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మొత్తానికి 'ది ప్యారడైజ్‌'తో మరో బంపర్‌ హిట్‌ను నాని తన ఖాతాలో వేసుకున్నాడని అర్థమవుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review