SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అప్పటి జనరేషన్‌లో బాలయ్య.. ఈ జనరేషన్‌లో ప్రభాస్‌‌కు మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డు..

Balayya Vs Prabhas :రాజమౌళి డైరెక్షన్ లో  ప్రభాస్ హీరోగా   తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా  చిత్రాలకు మళ్లీ బీజం  ఏర్పడింది. బాహబలి సాధించిన విజయంతో  మన మేకర్స్ అందరు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇపుడు చర్చించుకుంటున్నారు.  కానీ 90లలోనే బాలకృష్ణ తన ఓ సినిమాతో  ప్యాన్ ఇండియాను షేక్ చేసాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 08, 2026, 06:59 AM IST | Updated: Nov 08, 2026, 07:00 AM IST
Image Credit: Balakrishna Vs Prabhas (Source/File)
Join

Balayya Vs Prabhas :రాజమౌళి డైరెక్షన్ లో  ప్రభాస్ హీరోగా   తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా  చిత్రాలకు మళ్లీ బీజం  ఏర్పడింది. బాహబలి సాధించిన విజయంతో  మన మేకర్స్ అందరు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇపుడు చర్చించుకుంటున్నారు.  కానీ 90లలోనే బాలకృష్ణ తన ఓ సినిమాతో  ప్యాన్ ఇండియాను షేక్ చేసాడు.

90లలో షేక్..

90లలో అంటే 1992 సంవత్సరంలో   బి.గోపాల్ డైరెక్షన్ లో  విజయ లక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై టి.త్రివిక్రమ్ రావు ప్రొడ్యూసర్ గా  బాలకృష్ణ కథానాయకుడిగా  ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రం తెరకెక్కించారు.  ఈ మూవీ  తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగులో పోలీస్ సినిమాలు అంటే నిప్పులాంటి మనిషి,  కొండవీటి సింహం, అంకుశం తర్వాత ఖాకీ సినిమాల్లో ‘రౌడీ ఇన్ స్పెక్టర్’  ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. అప్పటి వరకు పోలీస్ పాత్రలంటే నీతి, నిజాయితీతో ఉండేవి. కానీ ఈ మూవీలో  అన్యాయం అంతం చేయడానికి పోలీసు .. రౌడీ గా మారిన తప్పులేదని ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రంలో చూపించడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్.. 
లారీ డ్రైవర్ చిత్రం తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో  వచ్చిన రెండో మూవీ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ మూవీలో బాలకృష్ణ కు జోడిగా విజయ శాంతి  నటించింది.  మిగతా పాత్రల్లో హరీష్, మోహన్ రాజు, కెప్టెన్ రాజు, సాయి కుమార్, కోట, జగ్గయ్య తదితరులు నటించారు. ‘రౌడీ ఇన్ స్పెక్టర్’  బాలకృష్ణ, విజయశాంతి కాంబోలో వచ్చిన 16వ చిత్రం. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జంటగా యాక్ట్ చేశారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా 35 సెంటర్స్ లలో 100 రోజులుకు పైగా నడిచింది. అంతేకాదు పలు కేంద్రాల్లో రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం అప్పట్లో చాలా ఏరియాల్లో ఘరానా మొగుడు రికార్డ్స్ తిరగరాసిందని బాలయ్య అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

డబ్బింగ్ వెర్షన్‌లో ఇరగదీసిన సినిమా.. 

తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రాన్ని తమిళంలో ‘ఆటోరాణి’గా డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. . ఇక హిందీలో ఈ సినిమాను అదే ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ టైటిల్ తోనే డబ్ చేసి విడుదల చేస్తే అక్కడ ఓ రేంజ్ లో ఇరగదీసింది.  ఈ చిత్రం  హిందీ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూల్లు రాబట్టిన హిందీ డబ్బింగ్ మూవీగా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ ముంబై మార్కెట్ లో సరికొత్త రికార్డులను తిరగ రాసింది. అంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలు కూడా హిందీ డబ్బింగ్  వెర్షన్ మంచి వసూళ్లనే సాధించిన చిత్రాలున్నాయి.

ఒక రకంగా అప్పట్లోనే ప్యాన్ ఇండియాను దడదడలాడించిన చిత్రంగా నిలిచిపోయింది రౌడీ ఇన్ స్పెక్టర్.  ఈ చిత్రంలో బాలకృష్ణ.. ఇన్ స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. ఆటోరాణిగా విజయశాంతి నటించింది. బొబ్బర్ లంక రామబ్రహ్మం పాత్రలో దివంగత మోహన్ రాజ్ విలన్ గా నటించారు. దివంగత కోట శ్రీనివాస రావు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు.  ఈ సినిమాకు ఆంజనేయ పుష్పానంద్ కథను అందించారు. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు. వియస్ఆర్ స్వామి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు.  

‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ రావు నిర్మాణంలో బాలయ్య.. ‘బొబ్బిలి సింహం’ సినిమా వచ్చింది. ఏ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా రౌడీ ఇన్ స్పెక్టర్.. 90లలో బాక్సాఫీస్ ను ప్యాన్ ఇండియా లెవల్లో బాహుబలి సినిమా కంటే ముందు షేక్ చేసిన చిత్రంగా నిలవడం విశేషం. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES