• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

Tiger Shroff : రీసెంట్‌గా ముంబైలో యువ హీరో టైగర్ ష్రాఫ్‌పై జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. టైగర్ ఫ్రాఫ్‌ ‌ను అతి సమీపం నుంచే కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌ తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఆయన డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో టైగర్ ఫ్రాఫ్ గాయాల నుంచి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టైగర్‌కు మన తెలుగు వాడైన డాక్టర్ వెంకటేశ్ మోవ్వ చికిత్స అందిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 01:03 PM IST|Updated: Oct 23, 2026, 01:09 PM IST
joinshare
టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!
Image Credit: Tiger Shroff (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Philippines Plane Crash: విన్యాసాలు చేస్తుండగా గాల్లో ఢీకొన్న 2 సైనిక విమానాలు..నలుగురు పైలట్లు దుర్మరణం

Philippines Plane Crash: విన్యాసాలు చేస్తుండగా గాల్లో ఢీకొన్న 2 సైనిక విమానాలు..నలుగురు పైలట్లు దుర్మరణం

2

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..

3

Hyderabad: మేడ్చల్ లో కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్..

4

Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

5

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tiger Shroff: రీసెంట్‌గా జరిగిన కాల్పుల ఘటన నుంచి టైగర్‌ ఫ్రాఫ్ ఇపుడిపుడే కోలుకుంటున్నారు. ఇక ఫిట్‌నెస్ అంటే కేవలం వ్యాయామాలు, కసరత్తులు  చేయడమే కాదు..  శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడం పైనే అందరి దృష్టి సారించాలన్నారు.  ముఖ్యంగా గాయాల నుంచి కోలుకోవడం, కండరాలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలం పాటు శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కూడా అంతే ముఖ్యమైన అంశం.

ముఖ్యంగా క్రీడాకారులు, నటీనటులు, నిరంతరం శారీరకంగా కష్టపడే వారికి ఈ అంశాలు ఎంతో కీలకం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్, ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా పేరు గాంచిన టైగర్ ష్రాఫ్, ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్, రీజెనరేటివ్ ఆర్థోపెడిక్స్ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ మోవ్వ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫిట్‌నెస్ నుంచి గాయాల నివారణ వరకు..

టైగర్ ష్రాఫ్ తన  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఈ ప్యాడ్ క్యాస్ట్‌లో  ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కండరాల బలాన్ని పెంచుకోవడం, శారీరక సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవడం, పోషకాహారం, కండరాల ఆరోగ్యం, గాయాల నివారణ, గాయాల నుంచి కోలుకునే విధానాలతో పాటు కీళ్ల సంరక్షణ గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది.  శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎముకలు, కీళ్ల సమస్యలకు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాల్లో వస్తున్న మార్పులపైనా వీరివురూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా టైగర్ ష్రాఫ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. గాయాల నుంచి కోలుకోవడంతో పాటు శారీరక ధృడత్వాన్ని కొనసాగించేందుకు డాక్టర్ వెంకటేష్ మోవ్వ వద్ద పీఆర్పీ (PRP), స్టెమ్ సెల్ చికిత్సలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిట్‌నెస్‌ను కొనసాగించడంలో గాయాల నిర్వహణ, కోలుకునే ప్రక్రియకు తాను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది  టైగర్ మాటలు వింటే ఓ స్పష్టత వస్తుంది.  

గాయాల చికిత్సలో ఆధునిక వైద్య విధానాలు..

టైగర్ ష్రాఫ్, డాక్టర్ వెంకటేష్ సంభాషణలో ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ, రోగి ఎముక మజ్జ నుంచి సేకరించిన కణాలను ఉపయోగించే చికిత్సలు వంటి ఆధునిక రీజెనరేటివ్ మెడిసిన్ విధానాల గురించి  చర్చ సాగింది. తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత కండరాలు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలకు ఈ చికిత్సలను పరిశీలించవచ్చని డాక్టర్ వెంకటేష్ మోవ్వ తన ప్యాడ్ క్యాస్ట్‌లో  వివరించారు.

దెబ్బతిన్న కణజాలం కోలుకునే ప్రక్రియకు తోడ్పడటం.. గాయాల నుంచి కోలుకునే సమయంలో అవసరమైన వైద్య సహాయం అందించడం, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అంశాలు ఈ చికిత్సా విధానాల్లో అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పుకొచ్చారు.  ప్రతి ఒక్కరికీ ఒకే తరహా చికిత్స సరిపోదని, సమస్య స్వభావం, తీవ్రతను బట్టి వైద్యులు తగిన విధానాన్ని నిర్ణయించుకుంటారు. 
ప్రతి సమస్యకూ శస్త్రచికిత్సే పరిష్కారం కాదన్నారు.

ప్రతి చికిత్సకు శస్త్ర చికిత్స అవసరం లేదు.. 
ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమనే అంశాన్ని ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి ఆర్థోపెడిక్ సమస్యకు శస్త్రచికిత్సే ఏకైక మార్గం కాదు.  రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరం లేని ఇతర చికిత్సా విధానాలను కూడా పరిశీలించి చికిత్స చేయవచ్చు.

తమకు ఎదురైన సమస్యకు ఏ చికిత్స సరైనదో తెలుసుకునేందుకు రోగులు నిపుణులైన వైద్యులను సంప్రదించాలన్నారు.  అవసరమైన పరీక్షల ఆధారంగా అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాల గురించి చర్చించాలన్నారు. ముఖ్యంగా క్రీడాకారులు, నటీనటులు తమ శారీరక సామర్థ్యాన్ని దీర్ఘకాలం కొనసాగించాలంటే గాయాల నివారణతో పాటు సరైన సమయంలో చికిత్స తీసుకోవడం కూడా అంతే అవసరం అన్నారు.

దీర్ఘకాలిక ఆరోగ్యానికి కీళ్ల సంరక్షణ కీలకం

నిత్యం వ్యాయామాలు చేసేవారు, క్రీడల్లో పాల్గొనేవారు, శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులు తమ సహజసిద్ధమైన కీళ్లు, కణజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేవలం ప్రస్తుత ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, భవిష్యత్తులోనూ చురుగ్గా కదలగలిగేలా శరీరాన్ని సంరక్షించుకోవడం అవసరం. ఈ క్రమంలో గాయాల నిర్వహణ, పునరావాస చికిత్సలు, తగిన వైద్య పర్యవేక్షణకు ప్రాధాన్యత పెరుగుతోంది.

టైగర్ ష్రాఫ్, డాక్టర్ వెంకటేష్ మోవ్వ మధ్య జరిగిన ఈ సంభాషణ ఫిట్‌నెస్‌ను మరింత విస్తృత కోణంలో చూడాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు గాయాల నుంచి కోలుకోవడం, వాటి ముప్పును తగ్గించడం, కండరాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుకోవడం కూడా ఫిట్‌నెస్‌లో అంతర్భాగమనే సందేశాన్ని ఇస్తుంది. 
రీజెన్ ఆర్థో స్పోర్ట్ గురించి..

డాక్టర్ వెంకటేష్ మోవ్వ స్థాపించిన రీజెన్ ఆర్థో స్పోర్ట్ (RegenOrthoSport) శస్త్రచికిత్స అవసరం లేని ఆర్థోపెడిక్ చికిత్సలు, రీజెనరేటివ్ మెడిసిన్, క్రీడాకారుల పునరావాస చికిత్సల్లో ప్రత్యేకత కలిగిన వైద్య కేంద్రం. ఈ సంస్థకు భారత్‌తో పాటు అమెరికాలోనూ క్లినిక్‌లు ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie