SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mirnalini Ravi Wedding: ఆధ్యాత్మిక గురువు మహావిష్ణువును పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరా బ్యూటీ? గుర్తుపట్టారా?

Mirnalini Ravi Wedding Photos: టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించిన మృణాళిని రవి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మలేసియాకు చెందిన మహావిష్ణును నవంబర్ 15న లంగ్‌కావి ఐలాండ్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written By Harish Darla
Published: Nov 16, 2026, 20:49 IST | Updated: Nov 16, 2026, 20:59 IST
Join

Mirnalini Ravi Wedding Photos: తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మృణాళిని రవి ఇప్పుడు ఓ ఇంటి వారయ్యారు. తన ప్రియుడు మహావిష్ణుతో కలిసి ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మలేసియాకు సమీపంలోని లంగ్‌కావి ఐలాండ్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ జంట ఒక్కటైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోల ప్రకారం.. వీరిద్దరి విరాహం నవంబర్ 15, ఆదివారం రోజున మృణాళిని రవి, మహావిష్ణు మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మహావిష్ణు మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువుగా పాపులర్ అయినట్లు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను మృణాళిని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

మృణాళిని, మహావిష్ణుల పరిచయం మొదట స్నేహంతో ప్రారంభమైందని కథనం చెబుతోంది. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో వివాహ బంధంగా మారింది. వీరి ప్రేమ ప్రయాణం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. మృణాళిని రవి సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, 2019లో విడుదలైన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమయ్యారు. అనంతరం 'ఛాంపియన్' సినిమాలో కథానాయికగా నటించారు. ఆర్య, విశాల్ కలిసి నటించిన 'ఎనిమీ'తో పాటు 'ఎంజీఆర్ మగన్', 'జాంగో', 'కోబ్రా' వంటి చిత్రాల్లోనూ కనిపించారు.

అలాగే టాలీవుడ్‌లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు', 'మామ మశ్చీంద్ర' వంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చివరిగా 2024లో విడుదలైన తమిళ చిత్రం 'రోమియో'లో కనిపించినట్లు కథనం పేర్కొంది. ఇప్పుడు మృణాళిని రవి పెళ్లి వార్తతో పాటు ఆమె వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లంగ్‌కావి ఐలాండ్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఆమె జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES