SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Varalaxmi Sarathkumar: చందమామ కనిపించకపోయినా.. భార్య కోసం చంద్రుడినే వెరైటీగా తీసుకొచ్చిన వరలక్ష్మి భర్త!

Varalaxmi Sarathkumar Husband: సినిమా నటీనటుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వారు జరుపుకునే వేడుకలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌తో కలిసి జరుపుకున్న కర్వా చౌత్ వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Written By Vishnu Priya
Published: Oct 30, 2026, 09:53 PM IST | Updated: Oct 30, 2026, 09:58 PM IST
Join

Varalaxmi Sarathkumar Karwachauth: తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి.. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024లో ఆర్ట్ గ్యాలరిస్ట్, పవర్‌లిఫ్టర్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా వరలక్ష్మి తన భర్తతో కలిసి కర్వా చౌత్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఉపవాసం పాటించారు. సాధారణంగా ఈ పండుగలో చంద్రుడిని చూసిన తర్వాత మహిళలు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే వరలక్ష్మికి ఈసారి ఒక చిన్న సమస్య ఎదురైంది.

సాయంత్రం సమయంలో ఆకాశం మొత్తం మేఘాలతో కమ్ముకోవడంతో చంద్రుడు కనిపించలేదు. ఎంతసేపు ఎదురుచూసినా చందమామ బయటకు రాలేదు. దీంతో వరలక్ష్మి తన ఫోన్‌లో మూన్ ట్రాకర్ యాప్ ద్వారా చంద్రుడి కోసం వెతికారు. అయినా సరైన ఫలితం కనిపించలేదు.

అప్పుడు ఆమె భర్త నికోలాయ్ ఒక ప్రత్యేకమైన ఆలోచన చేశారు. వెంటనే ఒక కాగితం తీసుకుని దానిపై చంద్రుడి బొమ్మను స్వయంగా గీశారు. ఆ బొమ్మను చూపిస్తూ వరలక్ష్మికి నీళ్లు తాగించి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం ఆమెకు ప్రేమగా ముద్దు పెట్టారు.

 

ఈ క్యూట్ వీడియోను వరలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చంద్రుడు మేఘాల వెనుక దాక్కోవడంతో చివరకు తన భర్తే చంద్రుడిని గీయాల్సి వచ్చిందని సరదాగా క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన అభిమానులు నికోలాయ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వేడుకలో వరలక్ష్మి ఎరుపు, బంగారు రంగుల సంప్రదాయ చీరలో కనిపించగా, నికోలాయ్ తెల్లటి కుర్తా, ధోతీలో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: 

తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES