Venkatesh Entry: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ఎంట్రీతో బాక్సాఫీస్ దగ్గర దీపావళి లెక్కలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. దీంతో ఆ సమయానికి రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాలన్నీ సైడ్ అయిపోయాయి. ఒకపక్క ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా రామాయణ, మరోపక్క కోలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలు మరో పక్క బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. ఈ మధ్యలో సందట్లో సడేమియా మాదిరి చిన్న సినిమాలు తమ లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. వీటన్నటింకీ థియేటర్స్ సర్దుబాటు చేయడం తలకు మించిన భారంగా మారింది. దీంతో థియేటర్స్ కోసం అసలైన వార్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్క సినిమాతో దివాళి రేస్ అంతా గజిబిజి గందరగోళంగా మారిందనే టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
వెంకీ రాకతో సినిమాల పోస్ట్ పోన్..
అక్టోబర్ 30న వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తుండటంతో అప్పుడు రావాల్సిన సినిమాలన్నీ దీపావళికి వాయిదా పడ్డాయి. కేవలం విశ్వక్ సేన్ ‘కల్ట్’ సినిమా మాత్రమే రేసులో ఉంది. మిగిలినవన్నీ నవంబర్ 6కి పోస్ట్‌పోన్ అయ్యాయి. ఇక ఇండియాలోనే భారీ తారాగణంతో హైయ్యోస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా నవంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ట్రైలర్ టాక్..
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోజరిగింది. ఈ ట్రైలర్ కూడా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులతో నిండిపోయింది. తన కుటుంబాన్ని చంపడానికి వచ్చిన వాళ్లపై ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఫ్యామిలీని రక్షించుకోవడానికి కత్తి చేత పట్టుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. ఎందుకు విలన్ గాంగ్ హీరో ఫ్యామిలీని చంపాలనుకుంటుందనే కాన్సెప్ట్ బాగుంది. మొత్తంగా ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి చూసేలా త్రివిక్రమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో పాటు యాక్షన్‌ను పెట్టాడు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ రోల్లో కనించనున్నాడు. మొత్తంగా అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆదర్శ కుటుంబం నెక్ట్స్ వీక్ ‘రామాయణ’..
రామాయణ విడుదలైన మరుసటి రోజే అంటే నవంబర్ 6న ‘ఇట్లు అర్జున’, సమ్మర్ హాలీడేస్, కిరణ్ అబ్బవరం నించిన ‘హత:’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. వీటి మేజర్ సినిమాలు అక్టోబర్ 30 నుంచి వాయిదా పడ్డవే. వీటికి తోడు కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘సీన్’, నయనతార యాక్ట్ చేసిన ‘మహాశక్తి’ చిత్రాలు అదే రోజు బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తుండటంతో కన్ఫ్యూజన్ మొదలైపోయింది.
దీపావళికి ముందే వెంకీ మామ..
దీపావళి వీకెండ్ నాటికి ఆదర్శ కుటుంబం సెకండ్ వీక్‌లో ఉండనుండగా, జైలర్ 2, రణబాలికి కూడా మంచి థియేటర్స్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ని భారీ సినిమాలు ఒకేసారి క్యూ కట్టడంతో స్క్రీన్ కౌంట్ అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్‌గా మారింది. మొత్తానికి ఈ పండగ సీజన్‌లో ప్రేక్షకుల మనసులు గెలిచి ఏ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.