• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

చాలామంది భారతీయ ఇళ్లలో సంప్రదాయబద్ధంగా వెండి, రాగి చెంబులు ఉంటాయి. సాధారణంగా వీటిని పూజ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తుంటారు. కొన్ని ప్రత్యేక పండుగ సమయాల్లో అయితే అల్మారాలో పెట్టినవి కూడా తీసి వాడతారు. అయితే, ఇవి నల్లగా మారతాయి. ముఖ్యంగా పూజ, వ్రతం వంటి పవిత్రమైన సందర్భాలలో పెద్ద పరిమాణంలో ఉండే చెంబులను ఎక్కువగా వాడుతుంటారు. రానున్న దీపావళి పండుగ వేళ, మీ ఇంట్లో ఉన్న సిల్వర్ లేదా రాగి చెంబులు కాలక్రమేణా నల్లగా మారిపోయాయా? వాటిని తిరిగి కొత్త వాటిలా మెరిసేలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సులభమైన టిప్స్‌తో మీరు వాటిని చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 09:12 AM IST|Updated: Oct 24, 2026, 09:16 AM IST
joinshare
దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!
Image Credit: How to Clean Silver and Copper Pooja Items

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

2

iQOO Neo 12 Launch: 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ ఫోన్ ఫీచర్లు అదుర్స్!

3

ఈ నెల 30న రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు..

4

Alluri District: అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. రోడ్డుపనులు చేస్తుండగా ఐదుగురు దుర్మరణం..

5

Ee Taram Kathalu: ప్రేమ పెరిగే కొద్దీ గొడవలు.. మన జీవితం ఈ 5 వేళ్లలాంటిదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Clean Silver and Copper Pooja Items: ఇంట్లో రాగి లేదా వెండి చెంబులను నిత్యం ఉపయోగిస్తున్నప్పుడు, అవి క్రమంగా నలుపు రంగులోకి మారిపోతుంటాయి. వీటిలో నీళ్లు పోసి దేవుడి గదిలో ఉంచుతుంటాం కాబట్టి, తేమ  ఇతర కారణాల వల్ల వాటిపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. రానున్న దీపావళి సందర్భంగా, మీ ఇంట్లో ఉన్న పెద్ద చెంబులను లేదా పూజ కోసం వాడుతున్న వస్తువులను శుభ్రం చేసుకోవాలనుకుంటే, ఈ చిన్న చిట్కాలను పాటించండి. ఈ పద్ధతుల ద్వారా మీ ఇంట్లోని మెటల్ వస్తువులు మళ్ళీ కొత్త వాటిలా మెరిసిపోతాయి.

వెండి చెంబుల విషయానికి వస్తే, అవి తరచుగా నల్లగా మారుతుంటాయి. వెండి వస్తువులను ఎక్కువ రోజులు ఉపయోగిస్తున్నప్పుడు అవి నలుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం సిల్వర్ సల్ఫర్ తో చర్య జరపడం. గాలిలో ఉండే సల్ఫర్ వల్ల వెండిపై నల్లటి పొర ఏర్పడుతుంది, దీనివల్ల వాటిని శుభ్రం చేయడానికి గట్టిగా తోమాల్సి వస్తుంది. అయితే, కష్టపడకుండానే చాలా సులభంగా ఈ వెండి చెంబులను శుభ్రం చేసే మార్గం ఉంది.

దీని కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని, దాని అడుగు భాగంలో అల్యూమినియం ఫాయిల్‌ను మెరిసే భాగం పైభాగం వైపు ఉండేలా పరచండి. ఇప్పుడు ఆ గిన్నెలో వేడి నీళ్లు పోసి, శుభ్రం చేయాల్సిన చెంబును పూర్తిగా మునిగేలా అందులో ఉంచండి. ఆ తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు కూడా కలపండి. సుమారు 20 నిమిషాల తర్వాత, చెంబుపై ఉన్న నలుపు రంగు మచ్చలు క్రమంగా పోయి శుభ్రంగా మారుతాయి. ఆ తర్వాత ఏదైనా మెత్తని గుడ్డను ఉపయోగించి, నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

అలాగే రాగి చెంబులను కూడా ఇంట్లో పూజల కోసం ఉపయోగిస్తుంటారు. వాటిని కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం ఒక అర చెక్క నిమ్మకాయను కట్ చేసి, దానిపై ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఆ నిమ్మకాయతోనే రాగి చెంబుపై ఉన్న మచ్చల మీద మృదువుగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలోని యాసిడిక్ గుణాలు, ఉప్పు కలిసి రాగిపై ఉన్న నల్లటి మచ్చలను సహజంగానే తొలగిస్తాయి. ఆ తర్వాత వాటిని నీళ్లతో కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!
 

ఈ దీపావళి పండుగ సమయంలో మీరు వెండి లేదా రాగి చెంబులను ఉపయోగిస్తున్నట్లయితే, ఈ పద్ధతుల ద్వారా వాటిని సులభంగా శుభ్రం చేసి మెరిసేలా చేయవచ్చు. వస్తువులను గట్టిగా తోమాల్సిన అవసరం లేకుండానే చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటి పూజా గదిలోని ఇతర లోహపు వస్తువులను శుభ్రం చేయాలనుకుంటే, 'పితాంబరి'ని ఉపయోగించవచ్చు. పితాంబరిని కొంచెం వేడి నీళ్లలో కలిపి వస్తువులను అందులో నానబెట్టి శుభ్రం చేస్తే, అవి త్వరగా తెల్లగా, కొత్త వాటిలా మెరిసిపోతాయి

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Spirituality
Telugu News
Festivals