SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!!

Ranabaali Movie Review: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేసిన చిత్రం ‘రణబాలి’. మ్యారేజ్ తర్వాత తొలిసారి వెండితెరపై జోడిగా యాక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 12:30 PM IST | Updated: Oct 16, 2026, 12:35 PM IST
Image Credit: Ranabaali movie Review (X/Source)
Join

మూవీ రివ్యూ: రణబాలి(Ranabaali)
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఈశ్వరీ బాయి, ఆర్నాల్డ్ ఓస్లో, లూక్ మాక్ గిబ్నీ, , జాసన్ షా,  తదితరులు
సంగీతం: అజయ్ - అతుల్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, జిష్ణు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ 
నిర్మాత: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్  
రచన, దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాన్    
విడుదల తేది: 16-10-2026
 

విజయ్ దేవరకొండ తొలిసారి చారిత్రక యోధుడి పాత్రలో టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ  సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

1878లో రాయలసీమలో శింగమనల ప్రాంతంలో కరువు తాండవిస్తుంది.  దానికి రెండు పుష్కరాల ముందు సరిగ్గా 24 యేళ్ల క్రితం 1854 రణబాలి (విజయ్ దేవరకొండ) పుడుతూనే కన్నుమూస్తాడు. అయితే అక్కడ స్థానికంగా వాళ్ల ఇలవేల్పు అయిన భద్ర మల్లన్న స్వామి (పోతులయ్య)కి వాళ్ల అమ్మ మొక్కుకుంటే ఆయన దయ వలన అతను అతను తిరిగి బతుకుతాడు.  బతుకుతాడు. అతడు ఇక్కడ ప్రజల కోసం చేసే కార్యం ఉంది. ఆ తర్వాత చనిపోతాడని స్వామి చెబుతాడు. అతనికి ‘రణబాలి’ అనే పేరు పెడతాడు. ఇక 1878లో అప్పటి దత్త మండలాలు (రాయలసీమ)తో పాటు మద్రాసు ప్రావిన్స్‌లో కరువు విలయతాండవం చేస్తూ ఉంటుంది. అక్కడ పరిపాలన అధికారి (కమిషనర్)గా హెక్టార్ (ఆర్నాల్డ్ ఓస్లో)వస్తాడు. అతను ఎంత క్రూరుడంటే తిండి గింజలను తింటున్న పక్షులను చంపేంత క్రూరుడు. ఇక కరువుతో విలయ తాండవం చేస్తోన్న ప్రజలను నుంచి ధాన్యాన్ని శిస్తూ వసూలు చేస్తుంటాడు. దాన్ని అక్కడ నుంచి మద్రాస్ ఓడరేవు మీదుగా  బ్రిటన్‌కు పంపించడానికి రైల్వే లైన్ వేయించే పనిలో పడతాడు. అందుకోసం అక్కడ ప్రజలను కడుపు మాడ్చి వారిన పనిలో తీసుకుంటాడు. ఈ క్రమంలో వాళ్లను చిత్రహింసలకు గురిచేసి తిండికి కూడా అన్నమో రామచంద్ర అనేలా చేస్తోన్న బ్రిటిష్ వాళ్లపై రణబాలి ఎలా తిరుబాటు చేసాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.


కథ విషయానికొస్తే..

దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ .. ఈ సినిమాను పీరియాడిక్ నేపథ్యంలో కాస్త ఫిక్షన్ జోడించి అక్కడ ప్రచారంలో ఉన్న జానపద కథను తీసుకొని ‘రణబాలి’ తెరకెక్కించాడు. ఇక తెలుగు సహా ప్రతి భాషలో పీరియాడిక్ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చినా ‘రణబాలి’ కోసం ఎన్నుకున్న నేపథ్యం బాగుంది. ముఖ్యంగా పల్లెల్లో కరువు తాండవిస్తున్న లెక్కచేయకుండా తెల్లదొరలు ఇక్కడ ప్రజల నుంచి శిస్తు వసూలు చేయడానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు. తమకు ఎదురు తిరిగిన వారిని ఉరికొయ్యలకు ఎక్కించడం వంటి సీన్స్ బాగానే రాసుకున్నాడు. ముఖ్యంగా రణబాలి మొరటోడిగా ఉన్న పది మంది మేలు కోరేవాడిలా చూపించాడు.

ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ మేకర్స్.. చిత్రాన్ని6భాగాలుగా చూపించాడు.  మొదటిది పాలేగాడు.. రెండోది కరువు రాక్షసుడు.. మూడోది జయమ్మ.. నాలుగు ఉపద్రవం.. ఐదు పాలేగాడు.. ఆరు కోబలి ఎపిసోడ్‌తో సినిమాను ముగించాడు. ఇక పాలెగాడు ఎపిసోడ్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలను కోట గోడకు వేళాడుతున్న దాన్ని సమాధి చేసే సీన్ బాగుంది. 

నాడు బ్రిటీష్ వాళ్లు మన వాళ్లపై చేసిన దారుణాలు, అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే.. ఆ తర్వాత మన పరాక్రమాన్ని కూడా బాగా హైలైట్ చేసారు. ముఖ్యంగా కొత్త అపాయింట్ అయిన వచ్చిన తెల్ల దొర ఎంత అరాచక వ్యక్తో చెప్పడానికి సినిమాలో కొన్ని సన్నివేశాలు  రాసుకున్నాడు. ముఖ్యంగా ధాన్యం రెండు బస్తాలు తగ్గాయన్న సీన్ దగ్గర పిట్టలను కాల్చే సీన్స్.. మరోవైపు కూలీ వాళ్లు నెత్తికి కట్టుకున్న బట్టలో ధాన్యాన్ని దాచుకునే వెళ్లే సీన్‌‌ను వాళ్లందరు నెత్తిన కట్టుకున్న ధాన్యాన్ని ఒకడున్న గిన్నలో వేయడం సీన్స్ హైలెట్ చేశాడు. ముఖ్యంగా రైల్వే కూలి పనులు చేసేవాళ్ల కుటుంబాలకు కాకుండా ఎవరైతే పనిచేస్తారో వారికి కడుపు నిండా అన్నం కాకుండా సగం మాత్రమే పెట్టాలని హూకుం జారీ చేయడం వంటి సీన్స్‌తో బ్రిటిష్ దొర ఎంత క్రూరుడనే విషయాన్ని చెప్పాడు. మొత్తంగా బ్రిటిష్ వారిని కరువు రాక్షసుడిగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

జయమ్మ ఎపిసోడ్ బాగున్నా.. అది మరి ల్యాగ్ అయింది. నాలుగో ఎపిసోడ్‌లో ఉపద్రవంలో బ్రిటిష్ వాళ్లకు హీరో సవాల్ విసరడం.. ఐదో ఎపిసోడ్‌లో పాలెగాడుగా అక్కడ జనాల బాగోగులు చూడటం. చిరవరగా కోబలితో సినిమాను ఎండ్ చేశాడు. విజయ్ దేవరకొండతో మంచి నటన రాబట్టుకున్నాడు. రష్మికతో అతని కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.


ముఖ్యంగా బ్రిటీష్ సైన్యం నాటి మన జనంపై చేసిన అరాచకాలు..మిగిలిన పీరియడిక్ సినిమాలతో పోలిస్తే.. రణబాలిలో రాహుల్ కొత్తగా ఏం చూపించాడనే విషయానికొస్తే.. అప్పటి కరువు కారణంగా చాలా మంది డొక్కలు మలమలమాడి ఎలా చనిపోయారనే విషయాన్ని సినిమాలో చూపెట్టాడు. అప్పటి జరగిన సంఘటలను చూపించాడు. ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో కొంచెం ఓ భద్రమల్లన్న స్వామి లీలలు వంటి సినిమాటిక్ లిబర్టీ కిందికి వస్తాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్‌ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అప్పటి ప్రదేశాలు.. ప్రజల వేషభాషలు, కట్టుబాట్లు అన్ని తెరపై చూపించి విధానం బాగుంది. ముఖ్యంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సినిమా మొదట్లో చెప్పించి సినిమా మొత్తాన్ని మన ధాన్యం గింజల కోసం చేసే పోరాటంగా మలిచారు.

హీరో క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలోనే ఉన్నాయి. కథకు తగ్గట్లుగానే మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ మీద కనిపించాయి.  రణబాలి తిరుగుబాటు మొదలైన తర్వాత మరో లెవల్‌కు వెళ్ళింది. అజయ్ అతుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా కొట్టాల్సింది. ఎడిటర్ ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తగ్గిస్తే బాగుండేది.  బ్రిటిష్ వాళ్లను రణబాలి తలలు తెగ నరికే ఎలివేషన్ సీన్స్.. మరోవైపు పోతరాజుగా విజయ్ సీన్స్ కథలో భాగంగా వస్తాయి

నటీనటుల విషయానికొస్తే..

సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ తన కెరీర్‌ పరంగా అద్భుత నటన కనబరిచాడు. ముఖ్యంగా  ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో  ప్రేక్షకులను తన నటనతో భావోద్వేగానికి గురిచేశాడు. రష్మికతో ఈయన కెమిస్ట్రీ బాగుంది. రష్మిక చనిపోయే సీన్‌లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది.  జయమ్మ పాత్రలో రష్మిక మందన్న  దేవరకొండ సహజ సిద్ధంగా ఒదిగిపోయింది. తన పాత్రకు న్యాయం చేసింది.హీరో తల్లి పాత్రలో నటించిన ఈశ్వరీ బాయ్ తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్రిటిష్ అధికారి పాత్రలో నటించిన ఆర్నాల్డ్ ఓస్లో తన పాత్రలో జీవించాడు. అతని విలనిజం పండటం వల్లే విజయ్ హీరోయిజం పండింది.  మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం

విజయ్ దేవరకొండ, రష్మికల నటన

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్

సెకండాఫ్ ల్యాగ్

కొన్ని లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్.. మొత్తంగా శింగనమల బొబ్బిలి ‘రణబాలి’ మెప్పిస్తాడు..

రేటింగ్: 3/5

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES