ట్రోల్స్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విజయ్,రష్మిక దంపతులు..
Virosh Team Complaints on Trolls: విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై కొంత మంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విజయ్ రష్మిక దంపతులు. రీసెంట్‌గా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజయ్, రష్మిక పాల్గొని మాట్లాడిన మాటలను కొంత మంది కావాలనే వక్రీకరణ చేశారనే ఉద్దేశ్యంతో వాళ్లు ట్రోలర్స్‌కు వ్యతిరేకంగా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
Vijay Devarakonda - Rashmika Mandanna: తమపై కావాలనే కొందరు పనిగట్టుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విరోష్ టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ జంటపై బురద జల్లే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్‌కు చెందిన ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడంతో పాటు సద్విమర్శలను తాము గౌరవిస్తామన్నారు. అయితే కొందరు తమపై కావాలనే చేసే ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసే దుష్ప్రచారాన్ని మాత్రం తాము ఒప్పుకోమని విజయ్, రష్మిక టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డి.సి.పి.కి వారు అందజేసినట్టు తెలిపారు.
విరోష్ గౌరవాన్ని కాపాడేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారి టీమ్ తెలియజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ,రష్మిక విషయానికొస్తే.. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ. 45 కోట్ల షేర్ (రూ. 80 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ‘రణబాలి’ సినిమాలో విజయ్ తొలిసారి చారిత్రక పాత్రలో నటించారు. ఇక రష్మిక కూడా ‘ఛావా’ తర్వాత ఈ సినిమా హిస్టారికల్ మూవీ చేసింది. మొత్తంగా పెళ్లి తర్వాత వీరిద్దరికి మంచి హిట్ ఈ సినిమాతో దక్కింది. త్వరలో వీళ్లిద్దరు కలిసి మరిన్ని చిత్రాల్లో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.