ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?
Bharatheeyudu 3 Shooing Starts: ఠాగూర్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. తీరా అతను చనిపోయాడని చెబుతారు. దీంతో తీరిగ్గా హీరో మీరు ఆపరేషన్ చేసింది చనిపోయిన వ్యక్తికే. అంటూ అతని డెడ్ సర్టిఫికేట్ చూపించి డాక్టర్లను ఖంగు తినిపిస్తాడు. ఇపుడు ‘భారతీయుడు 3’ సినిమా విషయంలో కమల్ హాసన్, శంకర్ చేయబోయేది అచ్చు అదే రకంగా అనిపిస్తోంది.
Bharatheeyudu 3 update: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఓ సినిమా హిట్టైయితే దానికి సంబంధించిన రాబోయే సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా పుష్ప సిరీస్, దృశ్యం సిరీస్, దురంధర్ సిరీస్‌లు కూడా మొదటి పార్ట్ సాధించిన ఫలితంతో రెండో పార్ట్ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడమే కాకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే.
కానీ ‘భారతీయుడు 3’ విషయంలో ప్రేక్షకుల్లో ఓ రకమైన నెగిటివిటీ నెలకొంది. 1996లో ‘భారతీయుడు’ సినిమా విడుదలైనపుడు లంచం అనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టిన విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం అనే ఈ సినిమాను ప్రేక్షకులు అప్పట్లో బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కొని మరి చూశారు. ఆ తర్వాత అదే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఠాగూర్’ లో కూడా లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం అనే కాన్సెప్ట్ చుట్టే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు బ్లాక్‌లోనే చూసిన సందర్బాలున్నాయి.
క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న భారతీయుడు..
ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్‌గా ‘భారతీయుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇపుడా మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా.. ‘నానాటికీ తీసికట్టు.. నాగం బొట్లు’ అన్నట్లుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా సీక్వెల్ కూడా భారతీయుడు సినిమా వచ్చిన రెండు మూడేళ్లకు వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. దాదాపు పాతికేళ్ల తర్వాత విడుదలైంది. ఎపుడో పాతికేళ్ల క్రితం బాగున్న ఐడియా .. ఇప్పటీ ప్రేక్షకులకు మెప్పించలేకపోయింది.
భారతీయుడు బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బ..
దీంతో ‘భారతీయుడు’ సినిమాకున్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింది. ఇపుడు ఈ సినిమాకు మూడో సీక్వెల్ అంటూ ‘భారతీయుడు 3’ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే కొంత మేర షూటింగ్ చేశారు. దీంతో మిగిలిన దాన్ని షూట్ చూసి ప్రేక్షకులపై ఒదలబోతున్నట్టు చెప్పారు.
బజ్ లేని భారతీయుడు 3..
ఇది ఎలా ఉందంటే.. చనిపోయిన శవానికి చికిత్స లేదా అలంకరణ ఎంత చేసినా వేస్ట్ అన్నట్టు.. ఆల్రెడీ ప్రేక్షకుల ఛీత్కారానికి గురైన ‘భారతీయుడు 2’ సినిమాను థియేటర్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రేక్షకులు చూడలేకపోయారు. అలాంటి కథ, కథనాలతో ఇపుడు ‘భారతీయుడు 3’ సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు శంకర్, కమల్ హాసన్‌లు ఏ నమ్మకంతో వస్తున్నారో వారికే తెలియాలి. ఓ రకంగా ప్రేక్షకులపై రివేంజ్ తీర్చుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బజ్ లేని ఎపుడో ఔట్ డేటెడ్ కథ అయిన ‘భారతీయుడు 3’ సినిమాతో శంకర్, కమల్ హాసన్‌లు అసలు హిట్ కొడతారా..? అసలు ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ దక్కించుకుంటుందా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఒక వేళ విడుదల చేసి తమ పరువును తామే వీళ్లిద్దరు పోగొట్టుకుంటారా ? ఇంత ఎందుకులే..అని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసి ఉన్న కాస్త పరువైనా దక్కించుకుంటారా అనేది చూడాలి.