SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై ఎందుకు ఈ అప్‌డేట్.. సడెన్‌గా ఫోటో ఎందుకు రిలీజ్ చేసినట్టు..!!

NTR Trivikram Movie: త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్నట్టు తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాటల మాంత్రికుడిగా దర్శకుడిగా తన పెన్ను పవర్ ఏంట్ ప్రేక్షకులకు రుచి చూపించాడు. కానీ గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విజయాలను నమోదు చేయలేకపోయాయి.దీంతో ఎన్టీఆర్‌తో చేద్దామనుకున్న ‘గాడ్ ఆఫ్ వార్’ కార్తికేయ సినిమా ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. దీంతో వాటికి చెక్ పెడుతూ మూవీ యూనిట్ చిత్ర నిర్మతలైన రాధాకృష్ణ (చిన బాబు), కళ్యాణ్ రామ్‌లతో పాటు ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు నలుగురు కలిసి ఉన్న ఫోటో రిలీజ్ చేసి వాటికి చెక్ పెట్టినట్టైయింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 12:13 PM IST | Updated: Nov 14, 2026, 12:18 PM IST
Image Credit: NTR - Trivikram Movie (X/Source)
Join

NTR Trivikram Movie Big Update: ఒకటి రెండు చిత్రాలు ఫ్లాపైనంత  మాత్రామా ఒక దర్శకుడి సత్తాను తక్కువ చేయకూడదు. కానీ సినీ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే హిట్ మాత్రమే మాట్లాడుతుంది. అప్పటి వరకు వరుస హిట్ చిత్రాలు చేసినా..ఒక ఫ్లాప్ వస్తే మాత్రం పదడుగులు వెనక్కి వేయాల్సిందే. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర దర్శకులుగా రాణించిన వాళ్లకు వాళ్ల కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ చిత్రాలు స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. ఆ తర్వాత వాళ్లు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సందర్భాలున్నాయి.

ఇక త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్‌తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ ప్రేక్షకులకు మెప్పించలేకపోయింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రీసెంట్‌గా ఫ్యామిలీ హీరోగా పేరు పడ్డ వెంకటేష్‌తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ సినిమా నాని గ్యాంగ్ లీడర్, దండు పాళ్యం, కార్తి ఖాకీ సినిమాల కలబోతగా ఉందనే కామెంట్స్ వినపడ్డాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఈ సినిమాలో రిలీజయ్యే సమయానికి ఏపీలో తుపాను ఎఫెక్ట్.. కరెంట్ ప్రాబ్లెమ్.. అన్ సీజన్ వంటి కూడా  ఈ సినిమా పరాజయానికి ఓ కారణంగా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన పౌరాణిక సినిమా ఆగిపోయిందనే కామెంట్స్ హల్ చల్ చేశాయి.

పైగా త్రివిక్రమ్ ఇప్పటి వరకు టచ్ చేయని పౌరాణికం కావడంతో ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినబడ్డాయి. కానీ వాటికి చెక్ పెడుతూ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్ , నిర్మాత రాధాకృష్ణలు నలుగురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి ఈ సినిమా ఆగిపోలేదనే సంకేతం ఇచ్చారు. ఇక సాహిత్యం, మన అష్టాదశ పురాణాలపై మంచి పట్టుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలపై అందరి దేవుళ్లపై పూర్తి స్థాయి చిత్రాలొచ్చినా.. కార్తికేయ స్వామిపై ఇప్పటి వరకు పూర్తి స్థాయి సినిమా రాలేదు. మరి త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌ను కార్తికేయ స్వామిగా ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 
ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్  షణ్ముఖుడి పాత్రతో పాటు మరో మూడు పాత్రల్లో నటించనున్నాడు. ఈ సినిమాలో శివుడు, విష్ణువు, బ్రహ్మ పాత్రల్లో కూడా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు సమాచారం. అద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే అన్నట్టు ఒకే దేవుడు ఒకరికి శివుడులా.. మరొకరికి విష్ణువులా.. ఇంకొకరికి బ్రహ్మగా కనిపిస్తాడు. అలా ఈ సినిమాలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరల పాత్రలను ఎన్టీఆర్‌తో చేయించాలనే యోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఇప్పటికే ఆయా పాత్రలకు సంబంధించిన స్కెచెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఏది ఏమైనా ఒక్క ఫోటోతో అన్ని మ్యాటర్స్‌కు చెక్ పెట్టేసాడు దర్శకుడు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES