SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jayalalitha: బిడ్డ పుడితే ఇబ్బందులు వస్తాయని భయపడ్డారా.. శరత్ బాబు గురించి జయలలిత సంచలన వ్యాఖ్యలు

Jayalalitha: దివంగత నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఆయన వ్యక్తిత్వానికి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తాజాగా సీనియర్ నటి జయలలిత శరత్ బాబుతో తనకు ఉన్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.

Written By Vishnu Priya
Published: Oct 07, 2026, 09:17 PM IST | Updated: Oct 07, 2026, 09:22 PM IST
Join

 Jayalalitha: జయలలిత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల సమయంలో శరత్ బాబు తనకు అండగా నిలిచారని చెప్పారు. ముఖ్యంగా ఆమె మొదటి వివాహం విఫలమైన సమయంలో తాను ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో శరత్ బాబు తనకు మంచి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా తోడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు.

సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన తనకు మంచి సలహాలు ఇచ్చేవారని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా సరైన మార్గనిర్దేశం చేసేవారని తెలిపారు. ఇలా ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా మరింత బలపడిందని జయలలిత పేర్కొన్నారు. ఒక దశలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించారట. అంతేకాదు తమకు ఒక బిడ్డ ఉండాలని కూడా అనుకున్నట్లు జయలలిత వెల్లడించారు. అయితే చివరికి ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. దీనికి ప్రధాన కారణం శరత్ బాబు ఆలోచనా విధానమేనని ఆమె తెలిపారు.

తమకు బిడ్డ పుడితే భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఆ పిల్లవాడు ఇబ్బందులు పడే అవకాశం ఉందని శరత్ బాబు భావించారట. ముఖ్యంగా ఆస్తులు, కుటుంబ వ్యవహారాల విషయంలో పిల్లలకు సమస్యలు రావచ్చని ఆయన ఆందోళన చెందేవారని జయలలిత చెప్పారు.

అందుకే భార్యాభర్తలుగా మారడం కంటే జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండటం మంచిదని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శరత్ బాబు తనపై ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కూడా జయలలిత చెప్పారు. తన నుంచి ఆయన ఎప్పుడూ డబ్బు ఆశించలేదని అన్నారు. తన జీవితంలో శరత్ బాబు ఒక మంచి మనిషిగా, స్నేహితుడిగా నిలిచిపోయారని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

ఇటీవల జయలలిత ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శరత్ బాబుతో ఆమెకు ఉన్న అనుబంధం గురించి మరోసారి చర్చ మొదలైంది. 2023లో శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన సినిమాలు, పాత్రలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు కూడా ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Read More: Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

 

Read More: బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES