ప్రపంచ నేతల ప్రశంసలు అందుకుంటున్న భారత్ పైలట్ స్మిత్ మచ్చర్..
Flight Dubai: ఆకాశంలో అలా సాగుతున్న విమాన ప్రయాణం. హఠాత్తు పరిణామం 174 మంది ప్రాణాలపై కుట్ర జరిగింది. గుర్తించిన పైలట్ గగనతలంలో ముంచుకొచ్చిన మృత్యువుతో భారత్ పైలట్ స్మిత్ మచ్చర్ పోరాటం చేశాడు. తనకు తానుగా రక్షించుకోవడమేకాదు… 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఇపుడు ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. తాను మృత్యువు నుండి బయటపడటమే కాకుండా.. ఎంతో మంది కాపాడిన వ్యక్తిగా ప్రపంచ మొత్తంతో కీర్తించబడుతున్న ఆయన ఎవరు.. ?
Smith Machchhar: ఫ్లై దుబాయ్ దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఊహించని భయానక ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్ లోపల జరిగిన ఈ అనూహ్య పరిణామంతో పైలట్ మచ్చర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. క్షణాల్లో తేరుకుని తనకు తానుగా రక్షించుకుని, విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడి చరిత్ర సృష్టించాడు.
ఒమన్‌కు చెందిన కో పైలట్ ఉగ్రవాదిగా మారి ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కాక్‌పిట్‌లో రక్తం కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో విమానం 33వేల అడుగుల నుంచి 17వేల అడుగులకు, దాదాపు 14వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కో పైలట్ గా ఉన్న వ్యక్తి పైలట్ పై కత్తితో దాడి..
కో పైలట్ ఉగ్ర కుట్రను గుర్తించిన పైలట్-ఇన్-కమాండ్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో ఘోర ప్రమాదాన్ని తప్పించాడు. ప్రాణాలను పణంగా పెట్టి శక్తియుక్తులను ప్రదర్శిచి మృత్యువును జయించాడు. ప్రమాదకర పరిస్థితిలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశారు. దీంతో తోటి ప్రయాణికులు, విధుల్లో లేని మరో ఇద్దరు పైలట్ల సహాయంతో, దాడికి పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడేలా చేశారు.
ప్రయాణం చేస్తున్న విమానంలో జరిగిన ఘటనతో ఇజ్రాయెల్ అధికారులు ఖంగుతిన్నారు. దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సాహసోపేతమైన చర్యతో వందలాది మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
భారత పైలట్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తి ..
ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదాన్ని తప్పించిన పైలట్ స్మిత్ మచ్ఛర్ ఎవరని నెటజన్లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. భారత సంతతికి చెందిన స్మిత్ మచ్ఛర్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన జూన్ 2022 నుంచి ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానాల్లో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. 737-800, 737 MAX 8,9 విమానాలను నడిపిన అనుభవం ఉంది. 9,750 గంటల పాటు విమానం నడిపిన అనుభవం మచ్చర్ సొంతం. ఫ్లై దుబాయ్‌లో చేరడానికి ముందు, ఆయన ముంబైలోని స్పైస్‌జెట్‌లో 11 యేళ్లు పనిచేశారు. ఆయన సీనియర్ కమాండర్‌గా కూడా పనిచేశారు, ఆ తర్వాత నవంబర్ 2020లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్ అయ్యారు. ఈ హోదాలో ఆయన ఇతర పైలట్‌లకు శిక్షణ ఇచ్చారు.
పైలట్ స్మిత్ మచ్ఛర్ ముంబైలోని ఘట్‌కోపర్ ఈస్ట్‌కు చెందినవారు. ఉద్యోగ కోసం దుబాయ్‌లో నివసిస్తున్నారని సమాచారం. ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరో విమానయాన సంస్థలో కెప్టెన్ పదవుల్లో ఉన్న పైలట్లను నియమించుకుని, వారిని నేరుగా కెప్టెన్‌లుగా నియమించే అవకాశం విమానయాన సంస్థలకు ఉంటుంది. స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా అతనికి 6,400 గంటలకు పైగా అనుభవం ఉందని మచ్చర్ ప్రొఫైల్ లో ఉంది. మచ్ఛర్ జూన్ 2007 నుంచి ఏప్రిల్ 2008 మధ్య వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మచ్ఛర్ సోదరుడు కూడా అకాసా ఎయిర్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు.
మచ్చర్ పై నెతన్యాహూ ప్రశంసలు..
విమాన ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రస్తుతం సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ఘనంగా సెల్యూట్ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన వీరత్వం వల్ల ఒక భారీ ఆకాశ విపత్తు తప్పిందని నెతన్యాహు పేర్కొన్నారు. నెతన్యాహు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, కెప్టెన్ స్మిత్‌ను నిజమైన హీరో గా అభివర్ణించారు.
మచ్చర్‌ను పొగడ్తల వర్షం కురిపించిన డొనాల్డ్ ట్రంప్ ..
ప్రాణాలతో పోరాటంచేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిని పైలట్ గ్రేట్ మ్యాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు.భారత పైలట్ బాధ్యతాయుతంగా పైలట్ స్మిత్ మచ్చర్ ఉగ్రకుట్రను భగ్నం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అసాధారణ ధైర్యంతో చేసిన పోరాట పటిమ గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఫై దుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ వీరత్వాన్ని దేశంలోనూ , పొరుగు దేశాల్లోనూ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.
ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్ క్షణకాలం అలక్ష్యం చేసి ఉంటే.. ఆయన ప్రాణాలతోపాటు 174 మంది ప్రయాణికుల పరిస్థితిని తలచుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సహాకారంతో)