• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /వామ్మె.. వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫిరంగి గుండు!

వామ్మె.. వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫిరంగి గుండు!

Viral News: వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఫిరంగి గుండు ఇరుక్కుపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో అక్కడికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ కూడా చేరుకుని.. డాక్టర్లు ఆఫరేషన్‌ చేపట్టారు.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 02:02 PM IST|Updated: Oct 01, 2026, 02:04 PM IST
joinshare
వామ్మె.. వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫిరంగి గుండు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telugu Viral News: వైద్య వృత్తిలో డాక్టర్లతో పాటు నర్సులు ఎన్నో వింతలతో పాటు విచిత్రమైన కేసులు నిత్యం చూస్తూ ఉంటారు. కానీ ఫ్రాన్స్‌లోని ఒక ఆసుపత్రి వైద్యులకు ఎదురైన ఓ వింత అనుభవం మాత్రం వారి జీవితాల్లో ఎన్నడూ మరిపోలేదని నమ్మాల్సిందే.. ఒక అత్యవసర చికిత్స కాస్తా.. నిమిషాల్లో తీవ్రమైన బాంబు బెదిరింపు తరహా అలర్ట్‌ ఆసుపత్రితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి ఏర్పడింది. 88 ఏళ్ల వృద్ధుడి మలద్వారం (Rectum)లో మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఆర్టిలరీ షెల్ ఇరుక్కుపోవడంతో వైద్య సిబ్బందితో పాటు బాంబు బృందాలు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దక్షిణ ఫ్రాన్స్‌లోని టౌలన్ (Toulon) నగరంలో ఒక 88 ఏళ్ల వృద్ధుడు విపరీతమైన కడుపు నొప్పితో చికిత్స కోసం సెయింట్-ముస్సే హాస్పిటల్‌కు (Sainte-Musse Hospital) వచ్చాడు.. అయితే, అక్కడే వైద్యులు పరీక్షలు నిర్వహించి.. శరీరంలో ఏదో గట్టి వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించి ఎక్స్‌రేతో పాటు స్కానింగ్ తీశారు.. స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని చూసి వైద్యుల సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అతడి శరీరంలో ఉన్నది సాధారణ వస్తువు కాదని.. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి పురాతన ఫిరంగి పేలుడు గుండు.. అని తెలింది.

శరీరంలో ఉన్న ఆ పురాతన బాంబు ఎక్కడ పేలిపోతుందో అనే తీవ్ర భయంతో ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే అలర్ట్‌ ప్రకటించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను.. వార్డులను వెంటనే ఖాళీ చేయించిన్నట్లు కూడా సమాచారం.. అలాగే రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ఫైటర్లతో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.

బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ టీమ్‌ ఆ పేలుడు గుండును పరిశీలించి.. అది అంత ప్రమాదకరం కాదని.. తక్షణమే పేలే అవకాశం లేదనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాతే వైద్యులు శస్త్రచికిత్సకు సిద్ధమయిన్నట్లు తెలుస్తోంది.. సర్జన్లు అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించి.. వృద్ధుడి శరీరం నుంచి ఆ పురాతన ఫిరంగి గుండును విజయవంతంగా బయటకు తీసిన్నట్లు తెలుస్తోంది.. వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకున్నాడు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Viral News
Trending News