• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR: రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు.. కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

KTR: రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు.. కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

ktr fires on cm revanth reddy: ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కూడా లాభంలేకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయని, తెలివిలేని రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులను నింపలేదంటూ కేటీఆర్ ఏకీపారేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 23, 2026, 02:17 PM IST|Updated: Oct 23, 2026, 02:36 PM IST
joinshare
KTR: రాహుల్ గాంధీకి  ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు.. కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: ktr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttarakhand: పెళ్లి దుస్తుల్లో 18 కి.మీ.లు నడిచిన నవవధువు.. సీఎంకు కీలక విన్నపం..  వీడియో వైరల్..

Uttarakhand: పెళ్లి దుస్తుల్లో 18 కి.మీ.లు నడిచిన నవవధువు.. సీఎంకు కీలక విన్నపం.. వీడియో వైరల్..

2

KTR: రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు.. కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

3

విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ.. అక్టోబర్ 28న పాఠశాలల్లో ఈ-వ్యర్థాల సేకరణ డ్రైవ్..!!

4

అమ్మాయిల ముసుగు లో అబ్బాయి.. వలపు వలలో బొక్క బోర్ల పడ్డ 1000 మంది ఖాకీలు.. చివరికి ఏమైందంటే?

5

టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ktr fires on Rahul Gandhi and cm revanth reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ నినోపై చర్యలు తీసుకొవడంతో పూర్తిగా విఫలమైందని  బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా సెటైర్లు వేస్తున్నాయి.  మరోవైపు  దీనిపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో అంబర్ పేట్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. డ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం, అమలు కానీ పథకాల హమీలనుఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటు మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిపాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ సెటైర్లు వేశారు.  తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు.


ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయని, తెలివిలేని రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులను నింపలేదంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పంపులు ప్రారంభిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తాను చేసిన అబద్ధాలు ప్రజల ముందు తేలిపోతాయని రేవంత్ రెడ్డి కుట్ర చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

మేడిగడ్డ కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారని,కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను కూల్చారన్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కూలిపోయిందంటూ అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దున్నపోతు ఇనిందంటే.. కిషన్ రెడ్డి దూడను కట్టేయమంటారని విమర్శలు గుప్పించారు.


కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటవుతాయన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పాలనసాగుతుందన్నారు.
మరో ఏడాది రేవంత్ రెడ్డి హడావుడి ఉంటుందని,ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతుల్లో మోసపోయిన అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణలోనే కాదు మళ్ళీ దేశం లో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గర లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ,బీజేపీ యెతర పార్టీలు దేశంలో కీలకం కాబోతున్నాయన్నారు.

 

మోదీ ఏం చేస్తున్నాడో చూస్తానే ఉన్నామన్నారు. ఈరోజు ఒకవైపు దేశాన్ని సంక్షోభంలోకి నెడుస్తున్న బీజెపికి ప్రత్యామ్నాయ ఎజెండా లేని కాంగ్రెస్ చూసిన తర్వాత కేసీఆర్చె ప్పింది వాస్తవం అని భావిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఎంత చేసిన లాభం లేదని, రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడంటూ సెటైర్లు వేశారు. దేశంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టే బీజేపీపై  సీజేపీ పేరుతో యువతీ యువకులు పోరాటం చేస్తున్నారు. రాజకీయ నాయకులను బీజేపీ బెదిరింపులకు గురిచేస్తుందని, యువతను బెదిరిచంలేదని వారికి అర్థమైందన్నారు.

బీజేపీ గత పదిసంవత్సరాలు ఎప్పుడు లేనంత బలహీనంగా తయారయిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలుతెలంగాణలో కలిసిపోయి పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేవలం.. కేటీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదన్నారు. తెలంగాణలో ఎంపీటీసీ జడ్పిటిసి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదంటూ మండిపడ్డారు కార్పొరేషన్ ఎన్నికలు పడితే 2017లో సెంచరీ కొట్టిన తీరుగా బీఆర్ ఎస్ కార్పొరేషన్లను  గెలుచుకుంటుందన్నారు. 

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని ఎన్నికల దాకా కలిసి  పనిచేయాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధన బలాన్ని మాత్రమే నమ్ముకుందని,విద్యార్థులను నిరుద్యోగులను యువతి యువకులను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిందంటూ కేటీఆర్ విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి వారు బుద్ధి చెప్పడంఖాయమంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
Telangana News
Hyderabad
Telugu News