SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Donald trump: నాకు పులిట్జర్ అయిన ఇవ్వాల్సిందే.. నోబెల్ శాంతి బహుమతి తర్వాత ట్రంప్ సెన్సెషనల్ కామెంట్స్..!..

Donald trump on Pulitzer prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి కూడా నోబెల్ శాంతి పురస్కారం రాకపొవడంపై తన అక్కసును వెళ్లగక్కుతునే ఉన్నారు. ఈ క్రమంలో ఎనిమిది యుద్దాలు ఆపిన తనను కాదని ఇటీవల ఇతరులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక తాజాగా.. పులిట్జర్ పురస్కారం తనకు రావాల్సిందే నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.

Written By Inamdar Paresh
Published: Oct 22, 2026, 12:03 PM IST | Updated: Oct 22, 2026, 12:21 PM IST
Image Credit: donaldtrump(file)
Join

Donald trump comments on Pulitzer prize: అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్  శాంతి బహుమతి తనకు రాకపోవడంపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎనిమిది యుద్దాలు ఆపినతనను కాదని ఇతరుల్ని ఎంపిక చేయడం నార్వే దేశానికి సిగ్గుచేటని మండిపడ్డారు. పలు దేశాలు సైతం తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన తనను పరిగణలోకి తీసుకొక పొవడం దారుణమన్నారు. 

అయితే.. ఇటీవల నోబెల్ కమిటీ అనూహ్యంగా ట్రంప్ కు మరోసారి షాక్ ఇచ్చింది. నోబెల్  శాంతి ప్రకటన తర్వాత కూడా ట్రంప్ ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అయితే తాజాగా.. ఆయన కన్ను కాస్త పులిట్జర్ పురస్కారంపై పడింది. నేను రాసిన రచనలకు పులిట్జర్ అయిన ఇవ్వాల్సిందేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రాజుకుంది.

యూఎస్ అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌత్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  పెండిల్టన్‌లోని టీ.ఈడీ గారిసన్‌ అరేనాలోని సభలో మాట్లాడుతూ.. పులిట్జర్ పురస్కారంపై ట్రంప్ మాట్లాడారు. ఎనిమిదియుద్దాలు ఆపిన తనకు నోబెల్ రాలేదని పదే పదే పలు వేదికలపై మాట్లాడిన ట్రంప్ ఈసారి  తానురాసిన రచనలకైన పులిట్జర్  పురస్కారం ఇవ్వాల్సిందే నంటూ చెప్పుకొచ్చారు. 

రష్యా దర్యాప్తుపై కథనాలకు గాను పులిట్జర్‌ అవార్డులు పొందిన జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని ట్రంప్ ఏకీపారేశారు. అసలు వారికి ఆ పురస్కారం అందుకునే అర్హత లేదని డొనాల్డ్ ట్రంప్ వెటకారంగా మాట్లాడారు. తాను ఎన్నో రచనలు చేశానని కనీసం పులిట్జర్ అయిన రావాల్సిందని ట్రంప్ తన మనసులో ఉన్న మరో కోరికను బైటపెట్టారు. ప్రస్తుతం ట్రంప్ పులిట్జర్ పురస్కారంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు డొనాల్డ్ ట్రంప్ ను ఇక నోబెల్ శాంతి బహుమతి అయ్యింది.. ఇక పులిట్జర్ పురస్కారం ఇవ్వాలా..?.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

ఇక ట్రంప్  తన టెంపరీ తనం నిర్ణయాలతో ప్రపంచదేశాల్ని ముప్పుతిప్పులు పెడుతున్న విషయం తెలిసిందే. తాను చెప్పిన విధంగా నడుచుకోకుంటే ట్రంప్ టారిఫ్ సుంకాల అస్త్రాలను  సంధిస్తున్నారు. యుద్దాలపై ఆయన తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES