• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ వార్.. ఖేష్మ్ దీవిపై దాడి..

అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ వార్.. ఖేష్మ్ దీవిపై దాడి..

America Iran again Attacks: గత కొద్ది రోజుల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ భగ్గుమంది. తాజాగా, హర్మూజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా పలు దాడులకు పాల్పడిందని ఒక స్థానిక ఇరాన్ అధికారి మంగళవారం తెలిపారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 10:40 IST|Updated: Nov 18, 2026, 13:44 IST
joinshare
అమెరికా, ఇరాన్‌ల మధ్య  మళ్లీ వార్.. ఖేష్మ్ దీవిపై దాడి..
Image Credit: Iran - America (ZEE Telugu News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Iran Vs America: ముఖ్యంగా బహ్రెయిన్‌‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. గత నాలుగు రోజుల్లో బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి చేయడం ఇది మూడోసారి. అమెరికా దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ తెలిపింది. 
ఇరాన్‌లో అత్యంత కీలకమైన  ఖేష్మ్ ద్వీపంలోని ప్రాంతాలపై అమెరికా జరిపిన దాడి వల్ల నివాస, వాణిజ్య, లేదా మౌలిక సదుపాయాల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదని హోర్మోజ్‌గాన్ దక్షిణ ప్రావిన్స్ డిప్యూటీ ప్రావిన్షియల్ గవర్నర్ అహ్మద్ నఫీసీని ఉటంకిస్తూ అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. ఖేష్మ్ ద్వీపంలో పరిస్థితి అదుపులో ఉంది.. అన్ని సహాయక, సేవా, కార్యనిర్వాహక సంస్థలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని IRGC తెలిపింది. ఖేష్మ్ ద్వీపం ఇరాన్ గుండె కాయ వంటిది. ఇక్కడే వాళ్ల ఆయిల్ నిల్వలకు సంబంధించిన అన్ని గౌడౌన్స్ ఉన్నాయి.

ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఖేష్మ్‌లో కనీసం ఐదు లేదా ఆరు పేలుళ్లు వినిపించాయి. దీనికి ముందు బహ్రెయిన్‌లోని ఒక అమెరికా రాడార్ వ్యవస్థపై డ్రోన్‌లతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించారు. ‘‘బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌లో అమెరికా దళాలు నిర్వహిస్తున్న రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన వార్ డ్రోన్లు ఈ ఉదయం ఒక కచ్చితమైన ఆపరేషన్ నిర్వహించాయి’’ అని ఉన్నత శ్రేణి గార్డ్స్ నడుపుతున్న 'సెపా' వార్తా వెబ్‌సైట్ తెలిపింది. ‘అమెరికా సైనిక డ్రోన్లు ఇరాన్ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘించడానికీ’ ప్రతిస్పందనగా ఈ దాడి జరిగిందని కూడా అది పేర్కొంది.

గత కొన్ని వారాలుగా ఇరాన్, అమెరికాల మధ్య పరస్పర దాడులు నెమ్మదిగా మొదలవుతున్నాయి. నవంబర్ 2న హర్మూజ్ జలసంధిలోని కీలకమైన ద్వీపంపై అమెరికా దాడి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాము నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే నౌకలు ప్రయాణించాలని స్పష్టం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. తమ ఆదేశాలను పాటించని నౌకలపై దాడులను ముమ్మరం  చేస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
America
Donald Trump
PM Modi