• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /అదృష్టమంటే ఇదేనేమో.. తవ్వకాల్లో దొరికిన బంగారు బంగాళదుంప!

అదృష్టమంటే ఇదేనేమో.. తవ్వకాల్లో దొరికిన బంగారు బంగాళదుంప!

Australian Farmer Gold Discovery: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఒక రైతుకు తవ్వకాల్లో బంగాళదుంప ఆకారంలో ఉన్న గోల్డ్‌ రాయి దొరికింది.. అయితే, దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.1 కోటికిపై ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 13:44 IST|Updated: Nov 18, 2026, 13:45 IST
joinshare
అదృష్టమంటే ఇదేనేమో.. తవ్వకాల్లో దొరికిన బంగారు బంగాళదుంప!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Australian Farmer Gold Discovery: మనిషి అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం.. కష్టపడి పనిచేసే వారిని ప్రకృతి కూడా ఒక్కోసారి అద్భుతమైన గిఫ్ట్స్‌తో అద్భుతం సృష్టిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ రైతు విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.. రోజువారీ పనుల్లో భాగంగా భూమిలోని పాత వస్తువులను సేరిస్తూ ఉంటాడు.. ఒక రోజు ఆ రైతుకు అచ్చం బంగాళదుంప ఆకారంలో ఉన్న ఓ భారీ బంగారు ముద్ద దొరికిందట.. దీని విలువ భారత కరెన్సీలో సుమారు కోటి రూపాయలకు పైగా ఉండటంతో అతను ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో టిబూబురా ప్రాంతానికి సమీపంలో ఉన్న  స్టార్ట్ స్టోనీ ఎడారి బంగారు తవ్వకాలకు చాలా ప్రసిద్ధి.. చాలామంది ఇక్కడ బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ రైతు కూడా గత కొద్దిరోజులుగా తన వద్ద ఉన్న మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ రాతి నేలపై బంగారం కోసం వెతుకుతూ ఉన్నాడు..

ప్రతి రోజు బంగారం కోసం వెతుకున్న సమయంలో ఒక రోజు మెటల్ డిటెక్టర్ నుంచి పెద్దగా ఏమీ స్పందన రాలేదట.. కానీ, ఓ చోట భూమిని సుమారు 100 మిల్లీమీటర్ల లోతు తవ్విన తర్వాత ఆ డిటెక్టర్‌ ఒక్కసారిగా బలమైన సిగ్నల్స్ ఇచ్చింది.. ఆసక్తితో మట్టిని తొలగించి చూడగా.. లోపల పసుపు రంగులో మెరిసిపోతున్న ఓ భారీ లోహపు పెద్ద ముద్ద కనిపించిందట.. చూడటానికి అచ్చం బంగాళదుంపలా ఉన్న ఆ వస్తువును చేతిలోకి తీసుకుని చెక్‌ చేయగా.. అది అత్యంత విలువైన బంగారు ముద్ద అని తేలడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.. ఆకారాన్ని బట్టి దీనికి టిబూబురా స్పడ్ అని పేరు పెట్టారట.

అయితే, ఈ బంగారు ముద్దను చెక్‌ చేయగా.. దీని మొత్తం బరువు సుమారు 1.2 కిలోగ్రాములు ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాళ్లతో పాటు మట్టి పోను ఏకంగా 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉండటం విశేషం.. ఇది దొరికిన సమయంలో మార్కెట్ ధర ప్రకారం దీని విలువ 1.95 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం.. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో వచ్చిన చిన్న హెచ్చుతగ్గుల కారణంగా దీని విలువ సుమారు 1.60 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.1 కోటికి పైగా ఉండే అవకాశాలు ఉన్నాయట..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Viral News
Trending News