SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

AI Girlfriend Viral News: తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురయింది. సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాను అనుకొని.. ఏకంగా ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీతో చాట్ చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఉన్నదంతా అమ్ముకొని రోడ్డును పడాల్సి వచ్చింది.. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 07:00 PM IST | Updated: Oct 18, 2026, 07:01 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

AI Girlfriend Viral News: ఆధునిక సమాజంలో సాంకేతికత మానవ జీవిత విధానాన్ని సులభతనం చేస్తున్నప్పటికీ.. అదే టెక్నాలజీ కొన్నిసార్లు ఊహించని విషాదాలకు దారితీస్తూ వస్తోంది.. వర్చువల్ ప్రపంచాన్ని నమ్మి నిజజీవితంలో అన్నీ కోల్పోయిన ఓ వ్యక్తి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనతో ప్రేమాయణం నడుపుతున్నది నిజమైన మహిళ కాదని.. అదొక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సృష్టించిన మాయా అని తెలిసేసరికి ఆ వ్యక్తి పూర్తిగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అసలు ఏం జరిగింది? ఆ వ్యక్తిని అడిగి రోడ్డు మీద పడటానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల మార్టిన్స్ కు 2020లో సోషల్ మీడియా వేదికగా జిప్సిక అనే ప్రొఫైల్ ఖాతాతో పరిచయం ఏర్పడింది. అందమైన డిపి.. అద్భుతమైన సంభాషణతో ఆ కథ అతన్ని కట్టిపడేసింది. రోజులు గడుస్తున్న కొద్ది ఇద్దరి మధ్య నిరంతరం చాటింగ్ పెరుగుతూ వచ్చింది. కాలక్రమంలో ఆ వర్చువల్ పరిచయం కాస్త ఊహించని ప్రేమగా మారిపోయింది. అవతలి వైపు స్పందిస్తున్న పదాలు ఎంత సహజంగా.. బాగోద్వేగాలతో నిండి ఉండేవంటే.. తాను ఓ కంప్యూటర్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామ్‌తో మాట్లాడుతున్నాడని అనుమానం అతనికి ఎప్పుడు కలగలేదు..

చాటింగ్ తో సరిపెట్టుకోలేక.. ఎలాగైనా తన ప్రేయసిని ప్రత్యక్షంగా కలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆమె నివసిస్తున్నట్లు చెప్పిన బెలో హొరిజోంటె సిటీకి అతడు ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 1900 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేశాడు. బస్సు చార్జీలతో పాటు ఇతర ఖర్చులకు అవసరమైన ఆర్థిక స్తోమత అతనికి లేకపోయినప్పటికీ.. ఆడమైన ప్రేమ మత్తులో మునిగిపోయి అతడు వెనక ముందు ఆలోచించకుండా అతనికున్న విలువైన వస్తువులతో పాటు ఆస్తులన్నిటిని విక్రయించి డబ్బులు సమకూర్చుకున్నాడు..

ఎట్టకేలకు అన్ని కష్టాలను ఓర్చుకొని.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆ సిటీకి చేరుకున్నాడు అతను.. అయితే, అక్కడ ఎదురైన చేదు నిజం కాళ్ల కింద భూమి కనిపించేలా చేసింది.. అక్కడ జెస్సికా అనే మహిళ అసలు లేని లేదట.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్‌ను ఉపయోగించుకొని.. సృష్టించిన పాత్రలను అదంతా.. డిజిటల్ బొమ్మలుగా చేసి.. అందులో అల్గారిథమ్స్ సందేశాలు పంపేదట.. అయితే, అక్కడ నిజంగా మహిళ ఉందనుకొని వచ్చిన అతనికి తీవ్ర నిరాసే ఎదురయింది..

తాను మోసపోయానని.. చేతిలో చిల్లి గవ్వలేక.. ఉన్నదంతా అమ్ముకొని రోడ్డున పడ్డానని తెలుసుకున్న అతను కన్నీరు మున్నీరయ్యాడు.. ఇంతకాలం నాతో మాట్లాడింది ఓ మిషన్ అని నేనెప్పుడూ ఊహించలేదంటూ అతడు కన్నీరు పెట్టుకున్నాడు.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన పోస్టులే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది చూసిన వారంతా సోషల్ మీడియాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు పెడుతూ వస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES