Durga Navaratri celebrations 2026 moola nakshatra significance: దేశ వ్యాప్తంగా దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఎంతో భక్తి భావనలతో అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించుకుని భక్తి, శ్రద్దలతో అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అయితే.. ఈ తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. నవరాత్రుల్లో ఆరవ రోజున అంటే.. 16వ తేదీన శుక్రవారం దుర్గమ్మ తల్లి సరస్వతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.
నవరాత్రుల్లో మూల నక్షత్రంకు చాలా విశేషమైన స్థానం ఉందని చెప్తుంటారు. చదువుకు, జ్ఞానంకు అధిదేవత అయిన సరస్వతి అమ్మవారి జన్మతిథిగా చెప్తారు. అందుకే ఈ రోజున అమ్మవారిని యథా శక్తి కొలుచుకుంటే జీవితంలో అన్ని రకాల విద్యల్లో ఆరుతెరుతారని పండితులు సూచిస్తున్నారు.
మూల నక్షత్రం రోజు ఏమిచేయాలంటే..?
నవరాత్రుల్లో ఆరో రోజున అమ్మవారు సరస్వతి అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తారు. శుక్రవారం రోజున మూల కలిసి రావడం మరింత విశేషంగా చెబుతున్నారు. ఈ రోజున ఎర్రటి వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనాలి. అదే విధంగా ఈరోజు తమ పిల్లలకు పుస్తకాలు, పెన్నులను పూజలో ఉంచాలి. అదే విధంగా అక్షరాభ్యాసం మొదలైనవి చేయిస్తే విశేషంగా అమ్మవారి అనుగ్రహం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
ఈరోజున అమ్మవారికి షోడషోపచారాలతో భక్తితో పూజించుకొవలి. చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, సిర మొదలైనవి నైవేద్యంగా సమర్పించుకొవాలి. ముఖ్యంగా చదువులో వెనుకగా ఉంటే వారు ఈ రోజున అమ్మవారిని భక్తితో పూజించుకుని పలకలు లేదా పెన్నులు, నోట్ పుస్తకాలు దానంగా ఇవ్వాలి.
ఇలా చేస్తే విద్యలో వస్తున్న ఆటంకాలు పోయి మంచి జ్ఞానం కల్గుతుందని పండితులు చెబుతున్నారు. సరస్వతి అమ్మవారిని అష్టోత్తర నామాలతో పాటు వివిధ స్తోత్రాలను భక్తితోపఠించి, పూజించుకొవాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయం కాలంలో లలిత సహస్రనామా పారాయణ, శతచండీ పారాయణ మొదలైనవి పఠిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.