Bus trapped on broken flyover in China Video: ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది రోడ్ల మీద వాహనాల్ని ఇష్టారితీన డ్రైవ్ చేస్తు వారి ప్రాణాల్ని మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది బస్సు ప్రయాణాలంటేనే జడుసుకుంటున్నారు. కొంత మంది తప్పతాగి వాహనాల్ని నడిపిస్తున్నారు. మరికొంత మంది నిద్రమత్తులో లేదా డ్రైవింగ్ రాకున్న కూడా వాహనాల్ని నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు కూడా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరిస్తే వాటి నుంచి ప్రయాణికులు బైటపడిన ఘటనలు కొకొల్లలు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
చైనాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు రెండు ఎలివేటేడ్ రోప్ వే కుంగిపోవడంతో రెండు బ్రిడ్జిల మధ్య చిక్కుకుని పోయింది. బస్సు వంతెన మీద ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నుంచి ప్రయాణికుల్ని అత్యవసర ద్వారం గుండా బైటకు పంపించి వేశాడు. ఒక్కొక్కరుగా అందరు బైకు వెళ్లిపోయారు.
పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులోని వారంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఎంత డెంజర్గా బస్సు ప్రమాదం నుంచి బైటపడిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.