SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

Armenia mps trade row: పార్లమెంట్ ఛాంబర్‌లో సివిల్ కాంట్రాక్ట్, స్ట్రాంగ్ అర్మేనియా పార్టీల ఎంపీలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 29, 2026, 06:53 PM IST | Updated: Oct 29, 2026, 07:01 PM IST
Image Credit: Fight between mps in Armenia parliament
Join

Fight between mps in Armenia parliament video: మనదేశంలో ఉన్నట్లే ప్రపంచ దేశాల్లో సైతం పార్లమెంట్, అసెంబ్లీలు ఉంటాయి. అయితే అవి వేర్వేరు పేర్లతో ఉంటాయి. ఆయా దేశాలకు చెందిన  ప్రజలు తమ సమస్యల్ని అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎన్నుకున్న నేతలు చర్చించి పరిష్కరిస్తారు. ఈ క్రమంలో అర్మెనియా పార్లమెంట్ లో అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ, ప్రతిపక్ష స్ట్రాంగ్ అర్మేనియా బ్లాక్‌కు చెందిన ఎంపీల మధ్య వివాదం రాజుకుంది. ప్రజల సమస్యల్ని చర్చించాల్సిన ఎంపీలు పరస్పరం బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. వీరి గొడవలు కాస్త పిడిగుద్దులు కురిపించుకోవడం వరకు వెళ్లింది. అపోసిషన్ పార్టీకి చెందిన నారెక్ కరాపెత్యాన్ కుటుంబంపై, అధికార సివిల్ పార్టీ ఎంపీ తారోన్ చఖోయాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.  

 

 

దీంతో ఎంపీల మధ్య వివాదం కాస్త క్రమంగా తారాస్థాయికి చేరి పరస్పరం దాడుల వరకు వెళ్లింది. పార్లమెంట్ ఆవరణలోనే ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై మరోకరు భౌతిక దాడులకు దిగారు. పవిత్రమైన చట్ట సభలోనే కాళ్లతో తన్నుకుంటూ రెచ్చిపోయారు. దీంతో పార్లమెంట్ లో ఒక్కసారిగా గందర గోళం తలెత్తింది.  భద్రత సిబ్బంది రంగంలోకిదిగి వారిని వారించడానికి ప్రయత్నించిన కూడా అక్కడి ఎంపీలు వినిపించుకోలేదు. 

మొత్తంగా ఈ ఘటనలో పలువురు ఎంపీల ముక్కుల నుంచి రక్తస్రావం అయ్యింది. అధికారులు అంబులెన్స్ లను మోహరించారు. స్ట్రాంగ్ అర్మేనియా పార్టీకి చెందిన ఎంపీ ఆండ్రానిక్ గెవోర్గ్యాన్ ముక్కు నుండి రక్తం కారుతుండగా, ఎంపీ రూబెన్ మ్ఖితార్యాన్ బట్టలు చిరిగిపోయాయి. పలువురు ఎంపీలు సైతం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై  నెటిజన్లు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES