• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /హోమ్‌వర్క్ ఉండదు.. ఎగ్జామ్స్ టెన్షన్ అసలే ఉండదు.. ప్రపంచంలోనే నంబర్-1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి?

హోమ్‌వర్క్ ఉండదు.. ఎగ్జామ్స్ టెన్షన్ అసలే ఉండదు.. ప్రపంచంలోనే నంబర్-1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి?

Finland Education System Secret: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల చదువులంటే పుస్తకాల మోత.. మార్కులు.. ర్యాంకుల గోల.. నిరంతర హోమ్‌వర్క్‌లు.. ఎగ్జామ్స్ టెన్షన్ సాధారణమే. కానీ.. ప్రపంచ దేశాలన్నింటికీ భిన్నంగా పూర్తి ఆనందకరమైన వాతావరణంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తోంది ఫిన్‌లాండ్ దేశం.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 08, 2026, 12:20 PM IST|Updated: Oct 08, 2026, 12:22 PM IST
joinshare
హోమ్‌వర్క్ ఉండదు.. ఎగ్జామ్స్ టెన్షన్ అసలే ఉండదు.. ప్రపంచంలోనే నంబర్-1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి?
Image Credit: Finland Education System Secret

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

2

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

3

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

4

Mandaadi Box Office: సూరి, సుహాస్‌కు ఊహించని బ్లాక్‌బస్టర్.. మండాడి కలెక్షన్లు ఎంతో తెలుసా?

5

Mamitha Baiju: మమితా మైథాలజీ ఎంట్రీ.. ఆ సీక్వెల్ మూవీతో తెలుగు డెబ్యూ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Finland Education System Secret: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల చదువులంటే పుస్తకాల మోత.. మార్కులు.. ర్యాంకుల గోల.. నిరంతర హోమ్‌వర్క్‌లు.. ఎగ్జామ్స్ టెన్షన్ సాధారణమే. కానీ.. ప్రపంచ దేశాలన్నింటికీ భిన్నంగా పూర్తి ఆనందకరమైన వాతావరణంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తోంది ఫిన్‌లాండ్ దేశం. ఐక్యరాజ్యసమితి  హ్యాపీనెస్ నివేదికల్లో వరుసగా ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన దేశంగా నిలుస్తున్న ఫిన్‌లాండ్.. విద్యావ్యవస్థలోనూ ప్రపంచంలోనే నంబర్-1 స్థానంలో కొనసాగుతోంది. అసలు అక్కడి పాఠశాలల్లో పిల్లలకు ఒత్తిడి లేకుండా నాణ్యమైన చదువు ఎలా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పిన్లాండ్ లో పిల్లలను చిన్న వయస్సులోనే పుస్తకాల ముందు కూర్చోనివ్వరు. కేవలం నాలుగు గంటలు మాత్రమే స్కూల్ ఉంటుంది. ఆ సమయంలోనూ  చిన్నారులకు ఆటలు, సామాజిక నైపుణ్యాలు, స్రుజనాత్మక కార్యకలాపాల ద్వారా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లడం అంటే కేవలం పాఠాలు చదువుకోవడం మాత్రమే కాదు.. ఇతరులతో కలిసి పనిచేయడం.. సమస్యలను పరిష్కరించడం.. స్వతంత్రంగా ఆలోచించడం వంటి అంశాలను కూడా నేర్చుకోవడం ముఖ్యమని భావిస్తుంటారు.

అయితే ఫిన్లాండ్ లో విద్యార్థులకు ఇంటి దగ్గర గంటల తరబడి కూర్చుండి చేసే హోంవర్క్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. తరగతి గదిలోనే ఎక్కువ విషయాలను అర్థం చేసుకునే విధంగా బోధించడంపై ఫోకస్ పెడతారు. పాఠశాల తర్వాత పిల్లలకు తమ కుటుంబంతో గడిపేందుకు, ఆటలు ఆడేందుకు, తమకు నచ్చిన పనులు చేసుకునేందుకు సమయం ఇవ్వాలని అక్కడి విద్యా విధానం భావిస్తుంది.

మన దగ్గర పరీక్షలు అనగానే  మార్కులు ఎక్కువగా వస్తేనే విద్యార్థి తమ ప్రతిభను అంచనా వేయడంలో కీలకంగా ఉంటుంది. కానీ ఫిన్లాండ్ లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడం కంటే..వారు పాఠాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు..దాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకుంటారు అనే అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. దీంతో మార్కుల కోసం మాత్రమే కాకుండా.. విషయం అర్థం చేసుకునే నేర్చుకునే అవకాశం మరింత పెరుగుతుంది.

ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. టీచర్లను కేవలం పాఠాలు చెప్పే వ్యక్తులుగా మాత్రమే కాకుండా.. విద్యార్థుల అభివ్రుద్ధికి మార్గనిర్దేశం చేసే నిపుణులుగా చూస్తుంటారు. ఉపాధ్యాయులకు మంచి ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు తరగతి గదిలో బోధనా విధానాలను ఎంచుకునే విషయంలోనూ స్వేచ్ఛ ఇస్తుంటారు. ప్రతి విద్యార్థి అవసరానికి తగ్గట్లుగా బోధించే ఛాన్స్ ఉంటుంది. ఫిన్లాండ్ విద్యా విధానంలో మరో ముఖ్య అంశం సమానత్వం. విద్యార్థుల మధ్య పోటీని పెంచడం కంటే.. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం వంటి కారణాలతో ఏ విద్యార్థి కూడా విద్యలో వెనకబకూడదన్న లక్ష్యంతోనే అనేక రకాల సహాయక వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ విజయానికి కేవలం హోంవర్క్ లేకపోవడం.. పరీక్షలు ఉండకపోవడం మాత్రమే కారణం కాదు..విద్యార్థులపై నమ్మకం.. మంచి టీచర్ శిక్షణ సమాన విద్యా అవకాశాలు.. ఆచరణాత్మక బోధన, పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం వంటి అనేక అంశాలు కలిసి పనిచేస్తాయి.

ఫిన్‌లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో  పోటీ అనే పదానికి చోటు ఉండదు. ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ విద్యాసంస్థలు అనే వ్యత్యాసాలు ఉండనే ఉండవు. దేశంలోని పాఠశాలలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తాయి. అందరికీ ఉచిత విద్య లభిస్తుంది. ఒక విద్యార్థిని మరొకరితో పోల్చకుండా, ప్రతీ ఒక్కరిలోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడమే వారి విజయ రహస్యమని చెప్పాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
World News