SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్లై దుబాయ్ దాడి ఘటనలో విస్తుపోయే విషయాలు..

Fly dubai airline Attack: ఫ్లైదుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడి ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మచ్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సహ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొడ్డలి తో దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ముందుగా కత్తితో పొడిచినట్లు వార్తలు వచ్చినప్పటికీ, విమానంలోనే అత్యవసర అవసరాల కోసం ఉంచే క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాడి చేసి ఉండొచ్చని వెల్లడించింది. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాని బెంజమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెతన్యాహు కూడా దాడికి క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాణిజ్య విమానాల్లో తప్పనిసరిగా ఉంచుతారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 02, 2026, 10:18 AM IST | Updated: Oct 02, 2026, 08:23 PM IST
Image Credit: Fly Dubai incident (ZEE News/Source)
Join

Fly Attack: అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం విమాన తయారీ సమయంలోనే వీటిని అమర్చుతారు. గతంలో ప్రయాణికుల క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచే ఈ పరికరాలను 2001 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11 ఉగ్రదాడుల తర్వాత పైలెట్లకు అందుబాటులో ఉండేలా కాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మార్చినట్లు కథనాలు పేర్కొంటున్నారు. కాగా, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన నిందితుడు ఇస్లామిస్ట్ రాడికల్ భావజాలంతో ప్రభావితుడయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. యూఏఈ జరుపుతున్న దర్యాప్తునకు ఇజ్రాయెల్ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. త్వరలోనే అన్ని నిజాలు వెలుగులోకి తెస్తామని వెల్లడించారు.

సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌‌‌‌ను మెరుగైన వైద్యం కోసం అధికారులు గురువారం అబుదాబికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ చేశారు. బుధవారం దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ కత్తితో దాడి చేయగా..మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన తన ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, కాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిట్ తలుపు తెరిచే బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నొక్కారు. దాంతో విమానం కూల్చాలని ప్రయత్నించిన కో-పైలట్ ను ప్యాసింజర్లు అడ్డుకున్నారు. ఆ వెంటనే విమానంలోని ఇతర పైలట్లు విమానాన్ని సౌదీలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 174 మంది ప్రాణాలు దక్కాయి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్ఛార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సౌదీ మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇప్పుడు తదుపరి వైద్యం కోసం యూఏఈకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సౌదీలోని భారత ఎంబసీ వెల్లడించింది.

కో పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్..

కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్ఛార్ ప్రాణాలను విమానంలోనే ప్రయాణిస్తున్న ఒకేఒక్క డాక్టర్ ఇజ్రాయెలీ డెంటిస్ట్ ముసావ్ షోటా కాపాడారు. దాడిలో పైలట్ మచ్ఛార్ తల, చేతులు దాదాపు తెగిపోయినట్లు డెంటిస్ట్ తెలిపారు. విపరీతంగా రక్తం కారిపోతూ, స్పృహ కోల్పోతున్నా పైలట్ వీరోచితంగా పోరాడారని వెల్లడించారు. 35 వేల అడుగుల ఎత్తులో సరైన పరికరాలు లేకపోయినా మచ్ఛార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముసావ్ ప్రథమ చికిత్స అందించి రక్తస్రావాన్ని అరికట్టారు. పైలట్ బ్లడ్ ప్రెషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేసి అతని ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి స్థానిక వైద్య బృందంతో  చికిత్స అందించారు.

కత్తిపోట్లకు గురైన పైలెట్..

కో-పైలట్ జరిపిన కత్తిపోట్ల దాడిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రవాదం నుంచి మానసిక రుగ్మతల వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని..ఇన్వెస్టిగేషన్‌‌లో సౌదీతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు  భాగస్వామ్యం అయ్యాయని అధికారులు తెలిపారు. కో-పైలట్ ను విచారించడంలో సాయం చేయడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు ఇప్పటికే సౌదీ అరేబియా చేరుకున్నారు. దర్యాప్తు కోసం నిందితుడిని  తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ కోరినప్పటికీ.. ఆ అభ్యర్థనకు అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదని అధికారులు చెప్పారు.

సౌదీతో ఇజ్రాయిల‌్ కు దౌత్య సంభందాలు లేవు..

సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ రెండు దేశాలు చాలా కాలంగా  భద్రత, ఇంటెలిజెన్స్ విషయాల్లో సహకరించుకుంటున్నాయి. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై దర్యాప్తు చేయడానికి నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ హమద్ అల్ షంసీ ఆదేశించారు. విమానం తమ దేశంలోనే రిజిస్టర్ అయిందని.. తమ దేశ జెండాతోనే నడుస్తున్నది కాబట్టి చట్టాల ప్రకారం దర్యాప్తుపై యూఏఈ న్యాయస్థానాలకే అధికార పరిధి ఉందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. విమానం తమ దేశం బయట ఉన్నప్పటికీ ..అందుల జరిగే నేరాలకు యూఏఈ చట్టమే వర్తిస్తుందని పేర్కొంది.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES