• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /పాకిస్థాన్, తుర్కియేలకు హౌతీ రెబల్స్ ఓపెన్ వార్నింగ్!

పాకిస్థాన్, తుర్కియేలకు హౌతీ రెబల్స్ ఓపెన్ వార్నింగ్!

Houthi Rebels Warn Pakistan And Turkiye: సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్‌తో పాటు తుర్కియేలు తమ సైనికులను పంపితే.. ఈ రెండు దేశాలపై దాడులు తప్పవని హౌతీ రెబల్స్ గడ్డి హెచ్చరికను జారీ చేశారు. సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసే ఏ దేశాన్ని అయినా వదిలే ప్రసక్తి లేదని ధమార్ ప్రావిన్స్ గవర్నర్ అహ్మద్ ఆల్ బుకైటి అన్నారు..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 03:18 PM IST|Updated: Sep 20, 2026, 03:20 PM IST
joinshare
పాకిస్థాన్, తుర్కియేలకు హౌతీ రెబల్స్ ఓపెన్ వార్నింగ్!
Image Credit: పాకిస్థాన్, తుర్కియేలకు హౌతీ రెబల్స్ ఓపెన్ వార్నింగ్!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Houthi Rebels Warn Pakistan And Turkiye: పచ్చిమాసియాలో ఉద్రుక్తతలు మరోసారి పరాకాష్టానికి చేరుకున్నాయని భావించవచ్చు.. యమన్‌కు చెందిన హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతను చేసిన నేపథ్యంలో.. ఇతర ముస్లిం దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.. సౌదీ అరేబియా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్తో పాటు తుర్కియేలను నేరుగా హౌతీ రెబల్స్ హెచ్చరించారు. ఒకవేళ ఆ రెండు దేశాలు సౌదీకి మద్దతుగా తమ సైనిక బలగాలను రంగంలోకి దించితే ప్రతీకార దాడులు తప్పకుండా ఉంటాయని తేల్చి చెప్పారు..

హౌతీ రెబల్స్ పాలనలో ఉన్న ధమార్ ప్రావిన్స్ గవర్నర్ అహ్మద్ ఆల్ బుకైటి ఈ మేరకు అధికారిక ఒక ప్రకటన విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు.. సౌదీ అరేబియా విషయంలో పాకిస్తాన్ తో పాటు తుర్కియేలు అనవసరంగా తల దూర్చవద్దన్నారు. అంతేకాకుండా తమ పోరాటంలోకి మధ్యవర్తులుగా వచ్చిన.. లేదా సౌదీకి అండగా సైన్యం మొహరించిన వారిని ఉక్కు పిడికిలితో అణచివేస్తామని.. వారి సైనిక సత్తా ఏమిటో చూపించి.. ఆ రెండు దేశాలకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ.. బుకైటి స్పష్టం చేశారు..

ఈ హెచ్చరిక వెనక సౌదీ రాజధాని రియాద్‌పై జరిగిన తాజా దాడులను నేపథ్యం ఉంది.. అంతకుముందు రోజు హౌతీ రెబల్స్ రియాద్ను లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షిపణులతో పాటు ఆత్మాహుతి ద్రోణులతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల తర్వాత సౌదీ అరేబియా కు రక్షణ కల్పించేందుకు సాంప్రదాయ మిత్రులు దేశాలైన పాకిస్తాన్ తో పాటు తుర్కియేలు తమ దళాలను పంపే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు అందడంతో అప్రమత్తమైన హౌతీ రెబెల్స్ ముందుగానే బహిరంగ హెచ్చరిక జారీ చేయడం విశేషం..

సౌదీ అరేబియాతో పాకిస్తాన్‌కు ఎన్నో ఏళ్లుగా బలమైన సైనిక, రక్షణ సంబంధాలు ఉన్నాయి. గతంలోనూ సౌదీ సరిహద్దు రక్షణ కోసం పాక దళాలు సేవలందించాయి.. మరోవైపు, ప్రాంతీయంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తుర్కియే కూడా గల్ఫ్ భద్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ తిరుగుబాటుదారులు ఏకంగా ఈ రెండు సైనిక శక్తులనే హెచ్చరించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ఒకవేళ ఇస్లామా బాధతో పాటు అహంకార ఈ అంశంపై దూకుడుగా వ్యవహరిస్తే..యెమెన్ యుద్ధ సంక్షోభం మరింత విస్తరించి పూర్తిస్థాయి అంతర్జాతీయ యుద్దంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు సైతం భావిస్తూ వస్తున్నారు..

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:
Pakistan