Navanethem navi pillay wins 2026 nobel peace prize: ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందాఅని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో కాసేపటి క్రితం నార్వేజియన్ నోబెల్ కమిటీ దీనిపై కీలక ప్రకటన చేసింది.ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ నవీ పిళ్లైను వరించింది. అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా నవనీతం నవీ పిళ్లైఅలుపెరగని పోరాటం చేశారు. ముఖ్యంగా యుద్ద నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, జాతిజాతి వివక్షతకు వ్యతిరేకంగా తీవ్రమైన అంశాలపై అలుపెరగని పోరాటం చేశారు.
ఈ విశేష సేవలకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం నవనీతమ్ నవీ పిళ్లై ను నోబేల్ శాంతి బహుమతి 2026 ను అందించింది. మరోవైపు నవనీతం నవీ పిళ్లై పూర్వీకులు తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు కు వలస వెళ్లారు. ఈ క్రమంలో భారత్ మూలాలున్న మహిళకు నోబేల్ శాంతి వరించడం భారతీయులకు గర్వకారణంగా చెప్పుకొవచ్చు.
దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లో సొంతంగా న్యాయవాద వృత్తిని ప్రారంభించిన తొలి మహిళగా నవనీతం ‘నవి’ పిళ్లై గుర్తింపు పొందారు.వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారు. అదే విధంగా.. 1995 – దక్షిణాఫ్రికా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు.
అదే ఏడాది రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1999–2003 – రువాండా ట్రిబ్యునల్ అధ్యక్షుత వహించారు. యుద్ధ నేరాలు, లైంగిక హింస, మారణహోమానికి సంబంధించిన కేసుల విచారణలో కీలక పాత్ర పోషించారు.
2003–2008 – నెదర్లాండ్స్‌లోని హేగ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 2008–2014లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా ఆరేళ్లపాటు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, వివక్షకు వ్యతిరేకంగా చర్యలు, బాధితులకు న్యాయం వంటి అంశాలపై దృష్టి సారించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. గత కొన్నేళ్లుగా ట్రంప్ తనకు నోబేల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే నంటూ మంకుపట్టుపట్టారు. నోబేల్ పురస్కారం ప్రకటనకు కొన్ని గంటల ముందు సైతం ఆయన వైట్ హౌస్ వేదికగా తాను 8 యుద్దాలను ఆపానని అన్నారు.
అంతే కాకుండా.. తనకు ఈసారైన నోబేల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చేలా నోబేల్ శాంతి బహుమతి భారత సంతతి మహిళను వరించడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.