హైదరాబాద్ అంటేనే హుస్సేన్ సాగర్.. ఇక హుస్సేన్ సాగర్ అంటేనే భాగ్యనగరం. ఒకప్పుడు ఎంతో మంది తాగునీటి అవసరాలను కూడా తీర్చింది. ఇప్పటి పరస్థితి వేరు. కానీ, రోజూ సాయంత్రం సమయంలో చాలా కుటుంబాలు సేదతీరడానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున సాయంత్రం వేళ కనిపిస్తారు. అక్కడ పిల్లలు, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకొంటూ ఉంటారు. చాలామంది కేక్ కట్టింగ్ చేయడం.. ఇన్ట్సా రీల్స్ వంటివి చేయడం చూస్తూ ఉంటాయం. కానీ, మొన్న పుట్టినరోజునాడే ఒక పాప ఆమె బంధువు వేడుకల కోసం వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేపథ్యంలో హైదారబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సిన ఈ పుట్టిన రోజు వేడుకలు క్షణికావేశం వల్ల విషాదంగా మారిందన్నారు.
ఇలా ఆరేళ్ల పాప చనిపోయిన విషయాన్ని గుర్తు చేసి ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టిన రోజు వేడుకలు సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలి. ఇళ్లలో జరుపుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి వేడుకలు జరిపితే ప్రమాదం. ఆ సమయంలో వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వెళ్తుంటాయి. అయినా, ట్యాంక్ బండ్ వద్ద పుట్టిన రోజు వేడుకలు జరపడం కూడా నిషేధం. ఎన్నిసార్లు పోలీసులు వచ్చి అక్కడి నుంచి పంపిచినా, మళ్లీ వచ్చి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయకూడదని హెచ్చరించారు. క్షణికావేశంతో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు.
ఇలా ట్యాంక్ బండ్ వద్దనే కాదు.. చెరువుల ప్రదేశంలో బర్త్‌డే వేడుకలు జరుపకూడదని అన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు. వారి ప్రాణాలు కూడా కాపాడుకున్నట్లు అవుతుందని ఎక్స్ వేధికగా వీడియో కూడా విడుదల చేశారు.. ఇక సాధారణంగా ట్యాంక్ బండ్ ప్రదేశాల్లో చాలామంది వీకెండ్‌లో వచ్చి సేదతీరుతుంటారు. పిల్లలు, పెద్దలకు కూడా కాస్త సమయంతో దొరుకుతుంది. సెలవు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక రానురాను బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం ప్రారంభించారు. ఈ ధోరణి రోజూ కూడా కొనసాగుతుంది. కొంతమంది యువత ఇలా ప్రారంభించారు. ఆ ప్రాంతంలో కేక్ కట్ చేసి వాట్సాప్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే స్టేటస్‌లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇలా ఇతరులు కూడా అదే ధోరణి ఫాలో అవుతున్నారు. ఇక సీపీ సజ్జనార్ హెచ్చిరించిన తర్వాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో మరి..
ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు! అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించాం. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాం. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి. కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. @HYDTP @hydcitypolice @CPHydCity
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 9, 2026