• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /పురుషులు గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్న టాప్ 4 విషయాలు ఇవే!

పురుషులు గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్న టాప్ 4 విషయాలు ఇవే!

Most Searched Topics By Men: గూగుల్‌లో పురుషులు ఎక్కువగా ఏం సెర్చ్‌ చేస్తారో తెలుసా? అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.. మగవారు ఎక్కువగా.. ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్‌తో పాటు జుట్టు రాలడం, ఇలా చాలా అంశాలను గూగుల్‌ సెర్చ్‌లో వెతుకుతారట.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 16:13 IST|Updated: Nov 19, 2026, 16:15 IST
joinshare
పురుషులు గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్న టాప్ 4 విషయాలు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Most Searched Topics By Men: సమాజంలో కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్ పరంగా వస్తున్న ఒత్తిడి, బడ్జెట్‌ ఫ్లానింగ్‌ కోసం, కష్టాల్లో వస్తున్న ఇబ్బందులను సమర్థవంతంగా మోసే పురుషుల కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 19న  అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. పైకి ఎంతో గంభీరంగా కనిపించే పురుషుల మనసులోనూ అనేక సందేహాలు, ఆందోళనలు, ఒత్తిడి ఉంటాయని మనందరికీ తెలుసు.. అయితే, తమ వ్యక్తిగత సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎన్నో అడ్డచ్చినా.. చాలామంది బాయిస్‌ సమాధానాల కోసం డైరెక్ట్ గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్నారు.. తాజా డిజిటల్ ట్రెండ్స్ ప్రకారం.. ఫిట్‌నెస్ మొదలుకొని వైవాహిక జీవితం వరకు చాలా మంది పురుషులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా కొన్ని విషయాలను సెర్చ్‌ చేస్తున్నారు. అవేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు..
ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్..
ఆరోగ్యంతో పాటు శరీరానికి సంబంధించిన ఫిట్‌నెస్ విషయంలో ప్రస్తుతం యువత ఎంతో శ్రద్ధ చూపుతూ వస్తున్నారట.. సిక్స్ ప్యాక్ యాబ్స్ ఎలా పొందాలి? పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఎలా? కండరాల పెరుగుదలకు ఎలాంటి ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి? జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే వ్యాయామం ఎలా చేయాలి? వంటి ప్రశ్నలు గూగుల్ సెర్చ్‌లో మొదటి స్థానంలో ఉందట.

జుట్టు రాలడం..
పురుషులను అత్యధికంగా వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలడం ఒకటి.. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం ఎలా? తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే మార్చుకోవాలంటే ఏం చేయాలి?  ఒత్తైన గడ్డం త్వరగా పెరగాలంటే ఏం చేయాలి వంటి అంశాల కోసం ఇంటర్నెట్‌లో విపరీతంగా సెర్చ్‌ చేస్తున్నారు. గూగుల్ అంధించిన సమాచారం ప్రకారం.. పురుషుల గ్రూమింగ్ సంబంధిత సెర్చ్‌లలో ఏకంగా 50 శాతం పెరిగిందట..

స్కిన్ కేర్..
చర్మ సౌందర్యం కోసం మహిళలలే ఎక్కువగా వెతుకుతారని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పురుషులు కూడా తమ స్కిన్‌ కేర్‌ కోసం సన్‌స్క్రీన్ లోషన్లతో పాటు ఫేస్ వాష్‌లు, సీరమ్‌లు, మాయిశ్చరైజర్ల గురించి వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్, మొటిమలకు చిట్కాలను గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారట..

ప్రేమ, పెళ్లి..
భావోద్వేగాలను అస్సలు బయటికి చెప్పుకోలేని చాలా మంచి పురుషులు.. బంధాల విషయంలో గూగుల్ నుంచి సలహాలు తీసుకుంటున్నారట.. తొలి డేట్‌లో ఎలా మాట్లాడాలి? అమ్మాయిలను ఆకట్టుకోవడం ఎలా? వివాహానికి సరైన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాల్సి ఉంటుంది? బ్రేకప్ బాధ నుంచి బయటపడటం ఎలా? సంతోషకరమైన వైవాహిక జీవిత రహస్యాల గురించి తెలుసుకుంటున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News