• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఒకప్పుడు ఉద్యోగాలంటే పురుషులదే హవా.. కానీ ఇప్పుడు సీన్ ఎందుకు మారిందో తెలుసా?

ఒకప్పుడు ఉద్యోగాలంటే పురుషులదే హవా.. కానీ ఇప్పుడు సీన్ ఎందుకు మారిందో తెలుసా?

International Mens Day 2026: సమాజంలో ఎప్పుడూ పురుషులకే అధిక అవకాశాలు దక్కుతాయనే ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలించినట్లయితే.. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, వలస నేపథ్యం, సామాజికంగా అణగారిన వర్గాలకు చెందిన యువకులు విద్య, ఉపాధి రంగాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

Written ByBhoomi
Published: Nov 19, 2026, 11:32 IST|Updated: Nov 19, 2026, 11:33 IST
joinshare
ఒకప్పుడు ఉద్యోగాలంటే పురుషులదే హవా.. కానీ ఇప్పుడు సీన్ ఎందుకు మారిందో తెలుసా?
Image Credit: International Mens Day 2026

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

International Mens Day 2026: సమాజంలో ఎప్పుడూ పురుషులకే అధిక అవకాశాలు దక్కుతాయనే ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలించినట్లయితే.. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, వలస నేపథ్యం, సామాజికంగా అణగారిన వర్గాలకు చెందిన యువకులు విద్య, ఉపాధి రంగాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వేగంగా మారుతున్న జాబ్ మార్కెట్ పరిస్థితులు.. ఆధునిక నైపుణ్యాల కొరత కూడా వారి కెరీర్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పురుషులు ఎదుర్కొంటున్న ఈ మారుతున్న పరిస్థితులు, సవాళ్లపై ఒక ప్రత్యేక విశ్లేషణ.

నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్బంగా పురుషుల ఆరోగ్యం, మానసిక స్థితితోపాటు విద్య, ఉపాధి సమస్యలపై కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ఉద్యోగాలు, వేతనాలు, ఉన్నత పదవుల్లో పురుషుల ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండట్లేదు. ముఖ్యంగా పేద  కుటుంబాలు, వలస నేపథ్యం ఉన్నవారి పిల్లలు చదువులో వెనకాడుతున్నారు. కొన్ని దేశాల్లో అమ్మాయిలతో పోల్చితే.. అబ్బాయిలు చదువును మధ్యలోనే ఆపేస్తున్న పరిస్ధితులు కూడా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కుటుంబ ఆర్థిక పరిస్ధితులు కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి.

గతంలో పెద్దగా చదువుకోకపోయినా ఫ్యాక్టరీలు.. తయారీ పరిశ్రమల్లో పురుషులకు మంచి సాలరీలతో ఉద్యోగులు లభిస్తుండేవి. కానీ ఇప్పుడు ఆటోమేషన్, సాంకేతిక పరిజ్నానం.. ఏఐ ప్రభావంతో ఇలాంటి ఉద్యోగాలు చాలా వరకు తగ్గుతున్నాయి. ఉద్యోగ రంగంలో పాత తరహా పద్ధతులు మారిపోతున్నాయి. ఉదాహరణకు అమెరికాలో 1970లో తయారీ రంగ కార్మికుల్లో హైస్కూల్ పూర్తి చేయని వారు 43 శాతం ఉండగా, 2016 నాటికి ఆ వాటా 10 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం ఏ రంగంలోనైనా ఉద్యోగం రావాలంటే కనీస విద్యార్హతలతో పాటు ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి.

సంరక్షణ, బోధన రంగాల్లో పెరుగుతున్న డిమాండ్:
ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ, బోధన, నర్సింగ్, వృద్ధుల సంరక్షణ వంటి రంగాల్లో ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ రంగాల్లో సిబ్బంది అవసరం మరింత ఎక్కువవుతోంది. అయినప్పటికీ ఈ రంగాల్లో పురుషుల భాగస్వామ్యం తక్కువగానే ఉంటోంది. ఉదాహరణకు కెనడాలో నమోదైన నర్సుల్లో సుమారు 90 శాతం మంది మహిళలే ఉన్నారు. చిన్నతనం నుంచే కొన్ని వృత్తులు మహిళలకు మాత్రమే అనే మూస ధోరణి ఏర్పడటం ఇందుకు ప్రధాన కారణం. ఈ మారుతున్న అవసరాలను గుర్తించి పురుషులు కూడా ఈ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

సమతూకంతో కూడిన అభివృద్ధి అవసరం:
పురుషులకు అవకాశాలు కల్పించడం అంటే మహిళల పురోగతికి అడ్డుపడటం కాదని గుర్తించాలి. వేతనాలు, ఉన్నత హోదాల విషయంలో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. మరోవైపు వెనుకబడిన వర్గాల పురుషులకు కూడా సరైన అవకాశాలు అందాలి. నర్సింగ్, సంరక్షణ రంగాల్లో వేతనాలు పెంచి, ఆ వృత్తులకు గౌరవం కల్పిస్తే మహిళలతో పాటు పురుషులకు కూడా మేలు జరుగుతుంది.

Also Read: 

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News