• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం..క్రైస్తవ, హిందూ వాటాపై షాకింగ్ రిపోర్ట్..!!

2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం..క్రైస్తవ, హిందూ వాటాపై షాకింగ్ రిపోర్ట్..!!

Pew Research Center: ప్రపంచ మతాల ముఖచిత్రం రాబోయే కొన్నేండ్లలో భారీగా మారబోతోంది. 2035 నాటికి క్రైస్తవ మతాన్ని దాటి ఇస్లాం మతం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా అవతరించనుందని ప్రముఖ ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Written ByBhoomi
Published: Nov 19, 2026, 12:35 IST|Updated: Nov 19, 2026, 12:36 IST
joinshare
2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం..క్రైస్తవ, హిందూ వాటాపై షాకింగ్ రిపోర్ట్..!!
Image Credit: Islam

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pew Research Center: ప్రపంచ మతాల ముఖచిత్రం రాబోయే కొన్నేండ్లలో భారీగా మారబోతోంది. 2035 నాటికి క్రైస్తవ మతాన్ని దాటి ఇస్లాం మతం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా అవతరించనుందని ప్రముఖ ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబర్18వ తేదీన విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రకారం.. జనాభా వృద్ధి రేటు, సంతానోత్పత్తి రేటులో ఉన్న తేడాలే ఈ మార్పునకు ప్రధాన కారణమని పేర్కొంది. ఈ రిపోర్టు ప్రస్తావించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ జనాభా మార్పునకు మత మార్పిడులు ప్రధాన కారణం కాదని.. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటమే కీలకమని ప్యూ సీనియర్ డెమోగ్రాఫర్ కాన్రాడ్ హ్యాకెట్ తెలిపారు. 2020-25 మధ్య కాలంలో ముస్లి మహిళల్లో సగటున 3.1 సంతానోత్పత్తి రేటు నమోదు అవ్వగా.. క్రైస్తవ మహిళల్లో ఇది 2.5గా నమోదు అయ్యింది. ఇతర మతాల మహిళల్లో ఈ రేటు కేవలం 1.6శాతం మాత్రమే నమోదు అయ్యింది.

2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2.27 బిలియన్ల క్రైస్తవులు, 2.02 బిలియన్ల ముస్లింలు ఉన్నారు. ఈ సంఖ్య 2035నాటికి ముస్లిం జనాభా 2.57 బిలియన్లకు, క్రైస్తవుల సంఖ్య 2.52 బిలియన్లకు చేరనుకుంటుందని గణాంకాలు వెల్లడించాయి. 2070నాటికి ముస్లిం జనాభా 80శాతం వ్రుద్ధితో 3.6 బిలియన్లు దాటనుండగా.. క్రైస్తవుల సంఖ్య 30శాతం పెరిగి దాదాపు 3 బిలియన్లకు చేరుకోనుంది. మరోవైపు హిందువులు, యూదుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రపంచ జనాభాలో వారి వాటా తగ్గనుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో జనాభా తగ్గుదల వల్ల బౌద్దుల సంఖ్య మరింత క్షీణించనుంది.

ఇక రాబోయే దశాబ్దాల్లో అమెరికా, కెనడాల్లో క్రైస్తవుల ప్రాబల్యం తగ్గి.. ఏ మతానికి చెందనివారి సంఖ్య భారీ పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగినట్లయితే 2070నాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ నిలవనుంది. భారత్ రెండో స్థానంలో నిలుస్తుందని ఈ  నివేదిక పేర్కొంది.

Also Read: 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News