SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మీరు మా హీరో.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు ప్రత్యేక ఆహ్వానం..

Israel PM Netanyahu Specila Invites to Smith Macher: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో తెగువ చూపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు కురిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆయనను ఇజ్రాయెల్, భారత్‌తో పాటు ప్రపంచానికే హీరోగా అభివర్ణించారు. అంతేకాదు వారి స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 01:01 AM IST | Updated: Oct 04, 2026, 11:37 AM IST
Image Credit: Smith Spl Ivites to Israel (ZEE News Telugu/Source)
Join

Smith Macher Special Invites from israel: రీసెంట్‌గా ప్లై దుబాయ్ ఘటనలో తన ప్రాణాలు పోతాయని తెలిసిన ఫ్లైట్‌లో ఉన్న వందలాది ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో తెగించి పోరాడిన స్మిత్ మచ్చర్ దైర్యానికి ప్రపంచ దేశాలు సలాం చేస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో చికత్స పొందుతున్న ఈయనకు  మరో అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి వెలిగించాలంటూ ఆహ్వానించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న  కెప్టెన్ మచ్చర్‌తో మాట్లాడిన నెతన్యాహు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఇక ప్రధాని మోడీ కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్‌ను ప్రత్యేకంగా వీడియో కాల్‌లో మాట్లాడి ఆయనకు ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మీరు దేశానికి చెందిన రియల్ హీరో అంటూ కితాబు ఇచ్చారు. 

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్‌జెడ్‌1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం కొద్ది సమయంలోనే వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. ఈ పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వీలైంది.

విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు పరిస్థితిని చక్కదిద్ది, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రాణాలు కాపాడారు కెప్టెన్ మచ్చర్ .  అసలు ఇదంతా ఎలా మొదలైంది? అది ఎలా ప్రారంభమైందో కెప్టెన్ మచ్చర్ ను అడిగి తెలుసుకున్నారు.  

స్మిత్ మచ్చర్‌  ధైర్యం చూసి ఆశ్చర్యపోయానన్న నెతన్యాహు ,  క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రదర్శించిన సంయమనం, సమయస్ఫూర్తి ని నెతన్యాహు మెచ్చుకున్నారు. కాక్‌పిట్  తలుపును తెరిచే పిన్‌ను  ఎలా లాగగలిగారని అడిగి ఆసక్తిగా తెలుసుకున్నారు.

ధైర్యసాహసాలతో ఎంతోమంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఇజ్రాయెల్‌కు వీరుడు, భారతదేశానికి వీరుడు, అలాగే యావత్ ప్రపంచానికి వీరుడు. నిజంగా చెప్పాలంటే, ఇది ఒక అద్భుతం అనిపించేంత గొప్ప విషయమన్నారు నెతన్యాహు. ఫ్లై దుబాయ్‌ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్‌  స్మిత్ మచ్చర్‌  త్వరగా కోలుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ  అభిలాషించారు.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES