• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా

Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా

Jensen Huang Resigned For Nvidia CEO: చైనా అమ్మాయితో రహాస్య గూడచర్యానికి పాల్పడిన ఉదంతంలో జేన్సన్‌ హువాంగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్విడియా కంపెనీ సీఈఓ పదవికి అతడు రాజీనామా చేశాడు. అంతేకాకుండా బోర్డు మంబర్‌ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 12, 2026, 11:08 PM IST|Updated: Nov 12, 2026, 11:14 PM IST
joinshare
Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా
Image Credit: Source: X (Twitter)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా

Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా

2

Jubilant Ingrevia: గ్రామాన్ని కబళిస్తున్న కెమికల్‌ ఫ్యాక్టరీ.. 'కాలా పానీ'తో నరకం అనుభవిస్తున్న ప్రజలు

3

Monal Gajjar Cancer: బిగ్‌బాస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్‌కు క్యాన్సర్..సర్జరీ తర్వాత షాకింగ్ వీడియో!

4

Nagula chavithi 2026: మూలా నక్షత్రంలో నాగుల చవితి.. రేపు ఈ ఒక్కపని చేస్తే కాలసర్పదోషాలు పరార్.!.

5

ZEEL Share Buyback 2026: జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్‌హోల్డర్లకు భారీ గుడ్‌న్యూస్.. రూ.600 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nvidia CEO Resign: మహిళతో శారీరక సంబంధం కలిగి ఉండగా.. ఆమె చైనా దేశస్తురాలైన రహాస్య గూడచార్యానికి పాల్పడడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్విడియా కంపెనీ సీఈఓ పదవికి అతడు ఎప్పటికప్పుడు రాజీనామా చేశాడు. ఎన్విడియా సంస్థ అధ్యక్ష పదవికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), బోర్డు సభ్యుడిగా ఉన్న జెన్సన్ హువాంగ్ తన పదవులన్నింటికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.

జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయడంతో అతడి స్థానంలో సంస్థ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) కొలెట్ క్రెస్‌ను ఆ బోర్డు తాత్కాలిక సీఈఓగా నియమించింది. శాశ్వత సీఈఓను ఎంపిక చేసే వరకు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్లు బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా సీఎఫ్‌ఓగా కూడా కొనసాగనున్నారు. శాశ్వత సీఈఓ నియామకం కోసం బయటి వ్యక్తులు... ఇతర అభ్యర్థులను పరిశీలించే ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎన్విడియా బోర్డు వెల్లడించింది.

కొలెట్‌ క్రెస్‌ ప్రస్థానం ఇదే
ఎన్విడియాలో 2013 సెప్టెంబర్‌లో కొలెట్ క్రెస్ చేరగా.. అప్పటి నుంచి సంస్థ సీఎఫ్‌ఓగా కొనసాగుతున్నారు. కంపెనీ ఆర్థిక విభాగానికి నాయకత్వం వహించడంతోపాటు సంస్థ వృద్ధి, వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఎన్విడియాలో చేరడానికి ముందు సిస్కో, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో దాదాపు 25 ఏళ్ల పాటు వివిధ ఆర్థిక విభాగాల బాధ్యతలు నిర్వహించారు. ఎన్విడియా డైరెక్టర్ల బోర్డుకు తొలిసారిగా చైర్మన్‌ను నియమించారు. ఈ పదవికి హార్వే సి. జోన్స్‌ను ఎంపిక చేశారు. అతడు 30 ఏళ్లకు పైగా వ్యాపారవేత్తగా, టెక్నాలజీ రంగ ప్రముఖుడిగా, వెంచర్ ఇన్వెస్టర్‌గా అనుభవం సంపాదించారు. సైనాప్సిస్ సంస్థకు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Telugu News
Trending News