Nagula chavithi tradition and puja vidhi: జ్యోతిష్య పండితుల ప్రకారం కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం. ఇతర మాసాల్లో కంటే కార్తీకంలో చేసే వ్రతాలు, పూజాలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాల్ని ఇస్తాయి. అందుకే కార్తీకంలో వచ్చే ప్రతి పండగకు కూడా విశేషందని ఉందంటారు. మనం నవంబరు 13న నాగుల చవితిని జరుపుకుంటాం. అది కూడా శుక్రవారం రోజున అమ్మవారి జన్మ నక్షత్రంమైన మూలతో కూడిన నాగుల చవితి రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది జీవింతంలో సరైన ఎదుగుదల లేకుండా తీవ్రసమస్యల్ని ఎదుర్కొంటారు.
సంతానం, వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు. ఇలాంటి వారు కాలసర్పదోషాం ప్రభావంకు గురైయ్యారని చెప్తుంటారు. ఈ క్రమంలో కాలసర్పదోషాలు అనేది సర్పాలకు అపకారం తలపెడితే వస్తాయి. ఇంట్లో పెద్దవారు లేదా పూర్వీకులు ఎవరైన సర్పాల్ని చంపితే ఆ దోషం తర్వాతి తరాలకు వస్తుంది. అందుకే పాములకు పొరపాటున కూడా హనీ తలపెట్టవద్దని అంటారు.
నాగుల చవితి శుభసమయం..
నాగుల చవితి అంటే శుక్రవారం రోజున బ్రాహ్మీమూహుర్తంలో 4 గంటల నుంచి 6 గంటల వరకు నాగుల పూజలకు అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్తారు. తెల్లవారిన తర్వాత ఆ తర్వాత 8 గంటలనుంచి 11 గంటల వరకు మధ్యస్థమైన సమయం అని సూచిస్తారు. ఈ సమయంలో జంటనాగులను పూజించుకొవాలి. పుట్టల వద్దకు వెళ్లి దానిలో పాలను పోయాలి. శివుడి ఆలయంలో అభిషేకం చేయించుకొవాలి. కాలసర్పదోష శాంతి పూజల్ని జరుపుకొవాలి.
యథా శక్తి ప్రకారం సర్పశాంతి మంత్రంను పఠించాలి. జంట నాగుల ప్రతిమల్ని ప్రతిష్టించుకొవాలి. నవనాగుల స్తోత్రాల్ని భక్తితో పఠించుకొవాలి.ఈ విధంగా చేస్తే అన్ని రకాలు కాలసర్పదోషాలు సమూలంగా దూరమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పుట్టమన్నును నుదురుకు బొట్టుగా ధరిస్తే కాలసర్పదోషాలు పోతాయని చెబుతుంటారు. అంతే కాకుండా పొరపాటున కూడా పాములకు అపకారం తలపెట్టవద్దు. కోబ్రా ఇంట్లోకివస్తే వెంటనే స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇవ్వాలికానీ దానికి హనీ తలపెట్టవద్దని చెబుతుంటారు.