• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /పాకిస్థాన్‌లో అత్యంత సంపన్న హిందువులు నివసించే అద్భుత నగరం ఇదే!

పాకిస్థాన్‌లో అత్యంత సంపన్న హిందువులు నివసించే అద్భుత నగరం ఇదే!

Hindu Majority City In Pakistan: పాకిస్థాన్‌లోని మిఠి నగరానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సిటీలో ఎక్కువగా హిందువులు మాత్రమే జీవిస్తూ ఉంటారట.. అంతేకాకుండా చాలా వరకు ఇక్కడ అన్ని దేవతల ఆలయాలు ఉంటాయట.. ఇక్కడ క్రైమ్‌ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఈ సిటీకి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 15:52 IST|Updated: Nov 19, 2026, 15:53 IST
joinshare
పాకిస్థాన్‌లో అత్యంత సంపన్న హిందువులు నివసించే అద్భుత నగరం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hindu Majority City In Pakistan: పాకిస్థాన్ అనగానే సాధారణంగా అక్కడి మైనారిటీలపై జరిగే దాడులకు సంబంధించిన వార్తలే ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ.. అదే దేశంలో దీనికి చాలా భిన్నమైన వాతావరణం కలిగిన ఒక ప్రత్యేక సిటీ ఉందంటే మీరు నమ్ముతారా?.. ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ.. విలాసవంతమైన బంగ్లాలు, విశాలమైన రహదారులతో పాటు అద్భుతమైన జీవనశైలితో పాకిస్థాన్‌లోనే అత్యంత సంపన్నమైన, ప్రశాంతమైన నగరంగా మిఠికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా భావించే ఈ నగరంలో హిందువులు అత్యధిక సంఖ్యలో నివసిస్తూ ఉంటారట..

థార్ ఎడారికి అత్యంత తక్కువ దూరంలోనే ఉన్న మిఠి నగరం ఆర్థికంగా చాలా ఉన్నతమైందని పాకిస్థాన్‌ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. పాకిస్థాన్‌లో హిందువులు మెజారిటీగా ఉన్న అతికొద్ది ప్రాంతాల్లో ఇది ఒకటి.. ఇక్కడ నివసించే హిందూ కుటుంబాల్లో ఎక్కువ మంది ప్రముఖ వైద్యులతో పాటు న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా స్థిరపడినట్లు సమాచారం.. వారి ఆర్థిక స్థోమతకు నిదర్శనంగా నగరమంతటా అద్భుతమైన విలాసవంతమైన భవనాలతో పాటు శుభ్రమైన వెడల్పాటి రహదారులు, కళకళలాడే మార్కెట్లు కనిపిస్తూ ఉంటాయట.. ఇక్కడి అభివృద్ధిని చూస్తే, ఇది ఒక ఎడారి ప్రాంతంలోని నగరమంటే ఎవరూ నమ్మలేకపోతూ ఉంటారు..

మిఠి నగరంలో పురాతనమైన, అద్భుతమైన విశాలమైన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయట.. ముఖ్యంగా శ్రీకృష్ణ మందిరంతో పాటు శివాలయం, ఇలా పలు దేవీదేవతల గుడులు భక్తులతో నిత్యం రద్దీగా ఉంటాయని సమాచారం.. దీపావళితో పాటు హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా నవరాత్రుల సమయాల్లో ఈ నగరం విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభను సంతరించుకుంటుందని సమాచారం. ఆలయాలతో పాటు ఇక్కడ మసీదులు కూడా ఉన్నాయట.

ఈ నగరానికి అసలైన అందం ఇక్కడి ప్రజల ఐక్యతలో దాగి ఉందని స్థానికులు సైతం చెబుతూ ఉంటారు.. తరతరాలుగా ఇక్కడ హిందూ.. ముస్లిం వర్గాలు అత్యంత స్నేహభావంతో.. ఒకరి పండుగల్లో మరొకరు పాలుపంచుకుంటూ కలిసి జీవిస్తూ ఉంటారట.. పాకిస్థాన్‌లోనే అత్యల్ప నేరాల రేటు నమోదయ్యే సురక్షితమైన నగరంగా మిఠి చాలా పేరు ఉందట.. ఇక్కడి ప్రశాంత వాతావరణంతో పాటు ప్రత్యేక సంస్కృతిని చూసేందుకు పాకిస్థాన్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారట.. పర్యాటక రంగం స్థానికులకు ప్రధాన ఉపాధి మార్గంగా ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Telugu News
Trending News