Muslim man attacked a woman on stage in the US: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతున్నాయ. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యంకు గురిచేస్తాయి. మరికొన్ని వీడియోలు చూస్తుంటే విస్తుపోయేలా ఉంటాయి. ముఖ్యంగా నెటిజన్లు ఎక్కువగా వైరల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే కాస్తంత వెరైటీగా వీడియోలు కన్పిస్తే వెంటనే వాటిని వైరల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల కొంత మంది ఏఐ టెక్నాలజీ, డీప్ ఫెక్ టెక్నాలజీతో వీడియోలను క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు.
A Muslim man attacked a woman on stage in the US for not wearing a burqa. The same men then... See more https://t.co/WF9nYrPn45
— Hindustan Ki Army (Fan) 🚩 (@HindustanKiArmy) November 20, 2026
కొన్ని సందర్బాల్లో అసలు వీడియోలు ఏవో లేదా ఫెక్ వీడియోలు ఏవో కూడా అర్థం కానీ సిట్యువేషన్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ మారిన ఘటన యూఎస్ లో చోటుచేసు కుంది. దీనిలో యువతి బుర్ఖా ధరించలేదని ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు.
ఆమె తెరుకునేలోపు మరింత రెచ్చిపోయి ఆమెపై పంచ్ లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయి ఆగంతకుడిపై రివర్స్ లో దాడి చేశారు. ఈ ఘటన కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో ఫెక్ అని, ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్లను తప్పుదొవ పట్టించేందుకు ఇలాంటి వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఈ వీడియో నిజమనుకుని దీనిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై యూఎస్ పోలీసులు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఇటీవల పలు చోట్ల ముస్లిం మహిళల హిజాబ్ లపై వివాదం తరచుగా వార్తలలో ఉంటుంది.