• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /2035 నాటికి భారీ మార్పు..! ప్రపంచ జనాభా అంచనాలు తారుమారు..!!

2035 నాటికి భారీ మార్పు..! ప్రపంచ జనాభా అంచనాలు తారుమారు..!!

Population: మరో పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లామ్ అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా ఉన్న క్రైస్తవాన్ని ఇస్లాం మతం బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. 2035 నాటికి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా అవతరించవచ్చని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. రీసెంట్‌గా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 05:19 IST|Updated: Nov 23, 2026, 05:20 IST
joinshare
2035 నాటికి భారీ మార్పు..! ప్రపంచ జనాభా అంచనాలు తారుమారు..!!
Image Credit: World Population (Source/ZEE News Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ప్రపంచాన్ని వణికిస్తున్న AI.. 2027లో భారీగా పెరగబోతున్న నిరుద్యోగిత..

ప్రపంచాన్ని వణికిస్తున్న AI.. 2027లో భారీగా పెరగబోతున్న నిరుద్యోగిత..

2

2035 నాటికి భారీ మార్పు..! ప్రపంచ జనాభా అంచనాలు తారుమారు..!!

3

KTR Memory: వరంగల్‌తో విడదీయరాని అనుబంధం.. గుర్తుచేసుకున్న కేటీఆర్‌

4

Healthy Food for Kids: పిల్లలు ఇష్టంగా తినే 5 హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఐడియాస్.. ఆరోగ్యానికి ఎంతో మంచివి!

5

కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో రిలీఫ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pew Research Centre: ప్రస్తుతం క్రైస్తవులదే ఆధిపత్యం.. ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవుల జనాభా 227 కోట్లుగా ఉండగా, ముస్లింల జనాభా 202 కోట్లుగా ఉంది. అయితే, 2035 నాటికి ముస్లింల జనాభా 257 కోట్లకు చేరుకోవచ్చని, క్రైస్తవుల జనాభా 252 కోట్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. అంటే క్రైస్తవులను అధిగమించి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా నిలిచే అవకాశం ఉంది. ముస్లింల జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అధిక జననాల రేటు అని ప్యూ పరిశోధకులు వెల్లడించారు (Islam Population Growth).

ముస్లిమ్ మహిళల రేటు సంతానోత్పత్తిరేటు 3.1.. 
2020-2025 మధ్య కాలంలో ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 3.1గా ఉండగా, క్రైస్తవ మహిళల్లో ఇది 2.5గా నమోదైంది. ఇతర మతాలకు చెందిన మహిళల్లో ఈ సగటు 1.6గా ఉంది. జనాభా పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే 2070 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా 360 కోట్లకు మించవచ్చని ప్యూ అంచనా వేసింది. అదే సమయంలో క్రైస్తవుల జనాభా 300 కోట్లకు చేరువలో ఉండవచ్చని తెలిపింది. ప్రపంచ జనాభా 2020 నుంచి 2070 మధ్య 29 శాతం పెరుగుతుందని అంచనా. ఇదే సమయంలో ముస్లింల జనాభా 80 శాతం, క్రైస్తవుల జనాభా 30 శాతం పెరగవచ్చని నివేదిక పేర్కొంది (Pew Research Report).

2070 నాటికీ అతిపెద్ద ముస్లిమ్ దేశంగా పాకిస్థాన్..

రానున్న దశాబ్దాల్లో ప్రపంచ జనాభా పెరుగుదలలో ఆఫ్రికా కీలక పాత్ర పోషించనుందని ప్యూ పరిశోధకులు అంచనా వేశారు (Muslim Population 2035). 2070 నాటికి కాంగోలో క్రైస్తవుల జనాభా 29.9 కోట్లకు చేరుకోవచ్చని, అమెరికాను అధిగమించి అత్యధిక క్రైస్తవ జనాభా కలిగిన దేశంగా అవతరించవచ్చని పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియా ఉంది. అయితే 2070 నాటికి పాకిస్థాన్ ఈ స్థానాన్ని ఆక్రమించవచ్చని ప్యూ అంచనా వేసింది. ఆ తర్వాత భారత్, నైజీరియా, ఇండోనేషియా దేశాలు నిలిచే అవకాశాలున్నాయి తెలిపింది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) నివేదిక ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం, క్రైస్తవ జనాభా పెరుగుతూనే ఉన్నప్పటికీ, 2035 నాటికి ముస్లిం జనాభా క్రైస్తవులను అధిగమించి అతిపెద్ద మతంగా అవతరించే అవకాశం ఉందని తెలిపారు.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో..)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
America