Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..
Humanoid robot arrested in germany: 16 ఏళ్ల బాలిక పట్ల రొబొట్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు రొబొట్ ను తయారు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Police arrested humanoid robot in germany: ఇటీవల చాలా మంది ఏఐ టెక్నాలజీ, రొబోట్ లను ఎక్కువగా తమ పనుల్లో ఉపయోగిస్తున్నారు. కొన్నిచోట్ల రొబొలు మనుషులు అమర్చిన చిప్ ను ఏవిధంగా కంట్రోల్ చేస్తే అలా స్పందిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం రొబొలు వైల్డ్ గా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు జనాలను దాడి చేయడం లేదా రొబొ తాను జీవం పోసిన యజమాని చెప్పిన మాటలను వినకుండా రెచ్చిపోయిన ఘటనలు ఇటీవల కొకొల్లలు. తాజాగా.. జర్మనీలో ఒక రోబొ 16 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్గా మారడంతో దీనిపై రచ్చ నెలకొంది.
జర్మనీలోని పశ్చిమ నగరమైన కొలోన్లో ఈఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే యువతి ఫాస్ట్-ఫుడ్ రెస్టారెంట్ వద్దకు వచ్చింది. అక్కడున్న రొబొతో సరదాగా మాట్లాడింది. ఆమె ఫ్రెండ్ దీన్ని వీడియో తీస్తున్నారు. అయితే.. రొబొ ఇంతలో బాలికను హత్తుకుని, ఆమె ప్రైవేటు పార్ట్ లను పట్టుకుని, ముందుకు వెనక్కునెట్టింది.
ఈ షాకింగ్ ఘటనతో యువతి ఒక్కసారిగా షాక్ అయ్యింది.వెంటనే రొబొ నుంచితప్పించుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వారు సైతం భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత తెరుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో జర్మనీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రొబొట్ ను హ్యాండిల్ చేసిన యజమానిని అరెస్ట్ చేశారు.
వారు ఉద్దేష్య పూర్వకంగా రొబొతో ఆ విధంగా యువతిని తాకేలా రిమోట్ కంట్రోల్ తో దానికి సూచనలు ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జర్మనీ పోలీసులు అతని వాహనంను, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో దీనిపై నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.