• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

Mary millben on Cjp Protest: దేశసమగ్రతను, ఐక్యతను దెబ్బతీసేలా కాక్రోచ్ జనతా పార్టీకి వెనకుండి అమెరికాలోని కొంత మంది కాక్రోచ్ జనతా పార్టీని నడిపిస్తురన్నారని యూఎస్ సింగర్ మేరీ మిల్బెన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Written ByInamdar Paresh
Published: Oct 14, 2026, 12:50 PM IST|Updated: Oct 14, 2026, 01:04 PM IST
joinshare
US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..
Image Credit: singer mary millben

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cobra Video: వామ్మో.. తలమీద నాగమణితో బుసలు కొడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో..

Cobra Video: వామ్మో.. తలమీద నాగమణితో బుసలు కొడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో..

2

India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?

3

హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

4

US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

5

CJP లీడర్లకు షాక్..! ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Abhijeet dipke and Cockroach Janata party funded by us donars: దేశ వ్యాప్తంగా  కాక్రోచ్ జనతా పార్టీ సర్ లో జరిగిన అవకతవకలపై.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ వేదికగా  జంతర్ మంతర్ వద్ద చేసిన నిరసనలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఎలాంటి నిరసనలు చేయోద్దని ఢిల్లీకోర్టు ఆంక్షలు విధించింది.  ఈ ఆంక్షలను సీజేపీ నేతలు ఉల్లంఘించడంతో పోలీసులు మరోసారి కాక్రోచ్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా.. జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ క్రమంలో పోలీసులు వీరిని తీహార్ జైలుకు తరలించారు.

జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపితే నేరమా..?. అని అభిజిత్ దీప్కే పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి దమ్ముంటే అధికారికంగా ఎమర్జెన్సీ పెట్టుకోమనండి.. ఎమర్జెన్సీలో కూడా ఇలా జరగలేదని మండిపడ్డారు. పోలీసుల చాటున దాక్కునే పిరికివాళ్లలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో యూఎస్ సింగర్ మేరీ మిల్బెన్ కాక్రోచ్ జనతా పార్టీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

ఎన్నికల జాబితా SIRలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ పై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై యూఎస్ సింగర్ మిల్బెన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని వ్యతిరేకిస్తున్న కొన్ని  శక్తులు కాక్రోచ్ జనతా పార్టీకి  ఫండింగ్ చేస్తున్నాయంటూ బాంబు పేల్చారు. ఇవి ప్రజాస్వామ్యంను, దేశ  ప్రగతిని వ్యతిరేకించే శక్తుల చర్యలంటూ సింగర్ మిల్బెన్ మాట్లాడారు. అదే విధంగా ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదని, భారతదేశ పౌరులంతా లేచి నిలబడి .. విఘాతక శక్తులను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. 

నా యువ దేశభక్తులారా, భయపడకండి.. 25 ఏళ్లుగా భారతదేశానికి సేవ చేస్తున్న, మూడుసార్లు ప్రధానిగా ఎన్నికైన వారు ఈ విచ్చిన్న శక్తులకు తలొగ్గబోరంటూ మేరీ మిల్బెన్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

భారత్ లో పుట్టి, పెరిగి, చదువుకున్న ఒక కొత్త గొంతుక మేల్కొలపాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు. బొద్దింకల పార్టీ యొక్క విచ్ఛిన్నకర స్ఫూర్తికి వ్యతిరేకంగా సంఘటితమై, శాంతియుతంగా నిరసన తెలియజేయాలని..యువ దేశభక్తులంతా మేల్కొనలాంటూ యూఎస్ సింగర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.  

అయితే.. గతంలో సైతం ఈ  ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మిల్బెన్.. భారత దేశం పట్ల తన అభిమానంను చాటుకున్నారు. జాతీయ గీతం, భక్తిగీతం 'ఓం జై జగదీష్ హరే'ను ఆలపించి భారత్ పై తన అభిమానంను చాటుకున్నారు. గతంలో 2023లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో మిల్బెన్ భారత జాతీయ గీతం 'జన గణ మన'ను ఆలపించిన విషయం తెలిసిందే.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Delhi
PM Modi