రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో ..హైదరాబాద్ వాసి దుర్మరణం.. ఉమ్రా యాత్రలో తీరని విషాదం!
Riyadh Airport Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక యాత్రికుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ అలీ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

పవిత్ర ఉమ్రా యాత్ర నిమిత్తం తన కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిన సమయంలో ఈ ఊహించని ధాటి చోటుచేసుకుంది.
శనివారం జరిగిన ఈ దాడిలో యూసుఫ్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. రియాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు కుమారులతోపాటు అత్త కూడా గాయాలపాలయ్యారు. ఒక కుమారుడికి మోకాలి శస్త్రచికిత్స జరిగింది. మరో కుమారుడి కాలి వేళ్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. అత్త తలకు గాయాలైనా ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. యూసుఫ్ అలీ భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మదీనా వెళ్లేందుకు చెక్ ఇన్ కియోస్క్ దగ్గర వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో ఈ ఘటనను ధృవీకరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాను బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నానని, వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందిస్తూ, మంత్రి జైశంకర్ మృతుని కుటుంబానికి సంతాపం తెలిపి, సాధ్యమైన అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. యూసుఫ్ అలీ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
హౌతీ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మొత్తం 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా, సౌదీ అరేబియాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.