• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!

Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!

Russia Pneumonic Plague: రష్యాలో ఊహించని ప్రమాదం తీవ్ర ఆందోళనకు దారితీసింది. పరిశోధన కేంద్రంలో శాంపిల్స్ సేకరిస్తుండగా.. పొరపాటున ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిపోవడంతో 28 ఏళ్ల మహిళా ల్యాబ్ టెక్నీషియన్ మరణించింది. ఆమె ప్రాణాంతక 'న్యుమోనిక్ ప్లేగ్' బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 05, 2026, 01:09 PM IST|Updated: Oct 05, 2026, 01:10 PM IST
joinshare
Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!
Image Credit: Russia Pneumonic Plague News

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nizamabad: పోలీస్ స్టేషన్‌లో  నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

2

20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

3

Meerut Wife Hanging: కారులో వేరే మహిళతో భర్త చాటుమాటు యవ్వారం..భార్య అడ్డుపడితే కారు బోనె‌ట్‌పై ఈడ్చుకెళ్లి..

4

KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..

5

Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Russia Pneumonic Plague: కరోనా మహమ్మారి కష్టాల నుంచి బయటపడిన ప్రపంచానికి మరో వ్యాధి సవాల్ విసిరేందుకు వస్తోందా..? రష్యాలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన తప్పు పెను ముప్పుగా మారనుందా..? ఇంతుకు ఏం జరిగిందంటే.. రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఓ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న మహిళా ల్యాబ్ టెక్నీషియన్ ప్రాణాంతక న్యుమోనిక్ ప్లేగ్ బారినపడి మృతి చెందింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తగా ఏకంగా ఐదు ఆస్పత్రుల కార్యకలాపాలను నిలిపివేసి.. వందలాది మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

షెలెఖోవ్ నగరంలోని ‘యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’లో దర్యా షిపీలోవా (28) అనే యువతి ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఇటీవల పరిశోధనల నిమిత్తం నమూనాలు సేకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బ్యాక్టీరియాతో ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిపోయింది. దీంతో ఆమె అత్యంత వేగంగా సోకే న్యుమోనిక్ ప్లేగ్ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు కనిపించడంతో ఆమెను సెప్టెంబర్ 29న ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందించినా.. ఫలితం దక్కలేదు. అక్టోబర్ 1న ఆమె 
ప్రాణాలు కోల్పోయారు.

న్యుమోనిక్ ప్లేగ్ అనేది గాలి ద్వారా అత్యంత వేగంగా ఇతరులకు వ్యాపించే తీవ్రమైన అంటువ్యాధి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఈ ముప్పు తీవ్రతను గ్రహించిన స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలికి వైద్యం అందించిన, ఆమెతో సంబంధం ఉన్న 5 ప్రధాన ఆసుపత్రుల కార్యకలాపాలను క్లోజ్ చేశారు. అలాగే ల్యాబ్ సిబ్బంది, ఆస్పత్రి వైద్యులు, ఇతర ఉద్యోగులతో సహా వందలాది మందిని వెంటనే క్వారంటైన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతున్నారు.

మహిళ మరణించడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందని మాస్కో టైమ్స్ వెల్లడించింది. మొదట్లో ఆ మహిళ ప్లేగు వ్యాధితో మరణించిందని అనుమానించారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా.. దాదాపు 200 మందిని క్వారంటైన్ చేశారు. అంతేకాకుండా నగరంలో బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ మాట్లాడుతూ.. ఆ మహిళ ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా.. కారణం తెలియని న్యుమోనియాతో మరణించిందని తెలిపారు. టెస్టింగ్ సమయంలో రోగి నమూనాలో ఎలాంటి అనుమానాస్పద సూక్ష్మజీవులు కనిపించలేదన్నారు. గత 10 రోజులుగా ఆ కేంద్రంలోని ఇతర ఉద్యోగులెవరికీ ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ కాలేదని.. ప్రస్తుతం అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. బాధితురాలితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి.. వారికి ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
World News