Serbia Election Results 2026: సెర్బియా పొలిటికల్ హిస్టరీలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అక్టోబర్ 25, 2026న జరిగిన సెర్బియా సార్వత్రిక ఎన్నికల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ (SNS) ఘోర ఓటమిని చవిచూసింది. అవినీతికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న విద్యార్థుల నేతృత్వంలోని కూటమి స్టూడెంట్ లిస్ట్ ఈ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 14 ఏళ్లుగా దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన సెర్బియా నేత అలెగ్జాండర్ వూచిక్.. ఈ చారిత్రాత్మక ఎన్నికలలో తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు.
పోలింగ్ ముగిసిన కొన్ని గంట్లోలనే ప్రాథమిక ఫలితాలు ఆధారంగా వూచిన తన ఓటమిని అంగీకరించారు. 250 సీట్లు ఉన్న సెర్బియా పార్లమెంట్లో 135 నుంచి 140 సీట్లతో స్టూడెంట్ లిస్ట్ స్పష్టమైన మెజార్టీ సాధించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. వూచిక్ పార్టీ 105 స్థానాలకే పరిమితం అయ్యో అవకాశం ఉంది. ఓట్ల శాతంలో విద్యార్థుల కూటమికి 52శాతం వచ్చాయి. ఎన్ఎన్ఎస్ పార్టీకి 32.3శాతం దక్కాయి. యూగోస్లేవియా విడిపోయిన తర్వాత గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. దేశంలో సమూల మార్పును ఆకాంక్షిస్తూ ప్రజలు, ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పరిణామంతో యూరప్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో కీలక మిత్రదేశాన్ని కోల్పోయినట్లయింది.
ఉద్యమం నుంచి పార్లమెంట్ దాకా:
ఈ ఎన్నికల్లో విద్యార్థుల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది రాజకీయ నాయకులు కాదనేది గమనార్హం. దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులైన వైద్యులు, కళాకారులు మరియు వివిధ రంగాల నిపుణులు ఈ బరిలో నిలిచి ఘనవిజయం సాధించారు. 2024 నవంబర్‌లో సెర్బియాలోని నోవి సాడ్ నగరంలో ఓ రైల్వే స్టేషన్ పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం.. అవినీతి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహించిన విద్యార్థులు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమించారు. దాదాపు రెండేళ్లుగా వారు సాగిస్తున్న ఈ నిరసనల ఉద్ధృతికి తలవంచిన వూచిక్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఉద్యమమే ఇప్పుడు ఎన్నికల రూపంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా చేసింది.
వీధుల్లో ప్రజల సంబరాలు:
వూచిక్ తన ఓటమిని అంగీకరించిన వెంటనే రాజధాని బెల్‌గ్రేడ్‌తో పాటు సెర్బియాలోని ప్రధాన నగరాల వీధుల్లోకి వేలాది మంది ప్రజలు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విజయం సాధించాం.. అంధకార పాలన ముగిసింది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపై నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం సెర్బియా అంతర్గత రాజకీయాలను మాత్రమే కాకుండా.. సమస్త ఐరోపా రాజకీయ రంగంలోనూ అత్యంత కీలకమైన మార్పులకు నాంది పలుకుతాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: