• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డెట్.!.

Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డెట్.!.

Vaikuta dwara darshan in Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని టీటీడీ దర్శనాలు, శ్రీవారి పలు సేవలపై కీలక అప్ డెట్ ఇచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ మాసంకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను ను 28.10.2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Written ByInamdar Paresh
Published: Oct 26, 2026, 02:32 PM IST|Updated: Oct 26, 2026, 02:44 PM IST
joinshare
Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డెట్.!.
Image Credit: tirumala(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Komal Nahta: సినీ విభాగంలో ZEEL భారీ మార్పులు.. జీ మూవీస్ క్రియేటివ్ డైరెక్టర్‌గా కోమల్ నహతా..!

Komal Nahta: సినీ విభాగంలో ZEEL భారీ మార్పులు.. జీ మూవీస్ క్రియేటివ్ డైరెక్టర్‌గా కోమల్ నహతా..!

2

ఎల్నినో ఎఫెక్ట్‌.. దేశంలో ఎరువుల అమ్మకాలు భారీగా పతనం!

3

దుబాయ్‌లో ఏకంగా 16 కిలోల బంగారు జుమ్కాలు.. రెండు గిన్నిస్ రికార్డులు..!!

4

200MP కెమెరాతో Oppo Find X10 ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డెట్.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ttd key update on Vaikuta Ekadashi darshan slots: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. ఇటీవల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మరోవైపు  తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలపై ఏర్పట్లలో టీటీడీ నిమగ్నమైంది. దేశ వ్యాప్తంగా చాలా మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం  చేసుకొవాలని తాపత్రయపడుతాయి. టీటీడీ సైతం సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలో  డిసెంబర్ మాసంలో తిరుమలలో ఏకాదశి దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల వైకుంఠ ఏకాదశి స్లాట్ లు మొత్తంగా ఐదు విడతల్లో ఉంటాయి. 

ఇవి 28.10.2026న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. మొత్తంగా ప్రతిస్లాట్   7 రోజుల పాటు ఉంటుంది. మొత్తంగా ఐదు రోజుల్లో ఏడుస్టాట్ లలో భక్తులకు దర్శన భాగ్యంను టీటీడీ కల్పిస్తుంది. డిసెంబర్ 16 నుండి 22 వరకు, డిసెంబర్ 17 నుండి 23 వరకు, డిసెంబర్ 22 నుండి 28 వరకు, డిసెంబర్ 23 నుండి 29 వరకు & డిసెంబర్ 24 నుండి 30 వరకు స్లాట్ లను టీటీడీ ప్రకటించింది.

వైకుంఠ ఏకాదశి స్లాట్‌లకు వయోపరిమితి- 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే అని టీటీడీ స్పష్టం చేసింది. ఆయా స్లాట్ లలో ఆన్ లైన్ లో దర్శనాలు బుక్ చేసుకున్న వారు సంబంధింత ప్రదేశంలోకి వెళ్లి క్యూలైన్ లో వేచి ఉండాలని టీటీడీ వెల్లడించింది.

మరోవైపు తిరుమలలో  సాధారణ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల యొక్క డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను సైతం టీటీడీ 28.10.2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.

రిపోర్టింగ్ రోజులు:-

సాధారణ సేవకులు తిరుపతి, తిరుమల రెండింటికీ తమ సేవా బుకింగ్ తేదీ నాటికే హాజరు కావాలి. తిరుమలలో వైకుంఠ ఏకాదశివేళ విపరీతమైన రద్దీ వేళ.. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి కారణంగా 2026 డిసెంబర్ 20 మరియు 21 తేదీలలో జనరల్, నవనీత, పరకామణి సేవకులకు వరుసగా దర్శనం ఉండదని టీటీడీ తెలిపింది.

 డిసెంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల కాలానికి కేటాయించిన పరకమణి కోటాను కూడా రద్దు చేశారు. పరకమణి సేవకులు తమ సేవా బుకింగ్ తేదీకి ఒక రోజు ముందుగా, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య తిరుమల సేవా సదన్ -2 లో హాజరు కావాలని, సేవకులకు ప్రొఫైల్ క్రియేషన్   సౌకర్యం కూడా అందుబాటులో ఉందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Tirupathi
TTD News
Andhra Pradesh