SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిసెంబర్ 16న స్వదేశానికి షేక్ హసీనా.. ఆ రోజే ఎందుకంటే..!!

Sheikh Hasina Return to Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత దేశానికి తిరిగే వెళ్లే డేట్ ప్రకటించింది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో పదవీచ్యుతురాలై భారత్‌కు వచ్చారు. రెండేళ్లకు పైగా ఢిల్లీలో ఆశ్రయం పొందారు. తాజాగా తొలిసారిగా స్వదేశానికి వెళ్ళే విషయమై తేదీని ప్రకటించడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 12:43 IST | Updated: Nov 24, 2026, 12:46 IST
Image Credit: Sheik Haseena (Source/File)
Join

Shaik Haseena Statement:షేక్ హసీనా.. ఏరికోరి మరి  డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్తానడంలో ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు బంగ్లాదేశ్‌ విజయ దినోత్సవం. 1971లో పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది స్వాతంత్రం పొందిన రోజు. దీంతో ఆ రోజును బంగ్లాదేశలో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇదే రోజున ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ రాజధాని  ఢాకాకు వెళ్లాలనే నిర్ణయానికి  హసీనా వచ్చినట్టు తెలుస్తుంది. స్వదేశానికి తిరుగు ప్రయాణంలో  బంగ్లాదేశ్‌  ప్రభుత్వం విమానం పంపాలని హపీనా డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌కు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ విమానంలోనే ప్రయాణించానని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్న మా.  ఇప్పుడు ఢిల్లీ నుంచి ఢాకాకు తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం జాతీయ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని అడుగుతోంది.  
పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం  షేక్ హసీనా దరఖాస్తు..
రాజ్యాంగ విరుద్ధ పరిస్థితుల్లో దేశం విడిచి రావలసి వచ్చిందన్నారు. ఇక  విజయ దినోత్సవం రోజున స్వదేశానికి  రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఉందంటున్నారు హసీనా.  కాగా బంగ్లాదేశ్‌  తిరిగి ప్రయాణానికి   అవసరమైన పత్రాల కోసం హసీనా  ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఆమెకు ఉన్న పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు లను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కొత్త పాస్‌పోర్టు, NID జారీ చేయాలని కోరుతూ ఆమె తరఫు న్యాయ ప్రతినిధులు నవంబర్ 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించారు.

లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థ ఈ మేరకు హైకమిషన్‌కు లేఖ రాసింది. అనంతరం హసీనా సంతకం చేసిన అధికార పత్రంతో మరోసారి దరఖాస్తు స్థితిగతులపై సమాచారం కోరింది. అయితే ఆమెకు ప్రయాణ పత్రాలు జారీ చేయడానికి చట్టపరమైన ఆధారాలు లేవని బంగ్లాదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

బంగ్లాదేశ్‌కు వస్తే షేక్ హసీనాను అరెస్ట్ ?

హసీనా స్వదేశానికి తిరిగి రావాలంటే భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారమే ప్రక్రియ జరగాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారత్ నుంచి అప్పగించాలని అధికారికంగా కోరినట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. ఈ అభ్యర్థనను సంబంధిత చట్టపరమైన ప్రక్రియలో పరిశీలిస్తున్నట్లు భారత అధికారులు వెల్లడించారు. మరోవైపు, హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని అక్కడి మంత్రి తెలిపారు. ఆమెను తీసుకురావడానికి విమానాన్ని ఏర్పాటు చేసే విషయంలో భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదన్నారు.

హసీనాకు మరణశిక్షతో  రీఎంట్రీపై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ..

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై అక్కడ నిషేధం కొనసాగుతోంది.మరోవైపు, 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. 2024లో విద్యార్థుల ఆందోళనల సమయంలో జరిగిన హింసాత్మక అణచివేతలో ఆమె పాత్రకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ ఆమె గైర్హాజరీలోనే కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఈ ఆరోపణలను, తీర్పును హసీనా ఖండించారు. తనపై జరిగిన విచారణ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.

1400  మంది ప్రాణాలు కోల్పోయారు.. 

2024 ఆగస్టులో ఆమె ప్రభుత్వం కూలిపోయేలా చేసిన ఆందోళనల్లో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె రాకకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతిస్తుందా? భారత్ నుంచి అప్పగింత ప్రక్రియ ఎలా సాగుతుంది? స్వదేశానికి చేరుకోగానే  ఆమెను అరెస్టు చేస్తారా? అనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా  ఆసక్తి నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES