తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!
Snake Vs Scorpion Video: ఓ పాము తేలుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ఈ వీడియోలో తేలు ఆ పాము దాడి నుంచి తప్పించుకోవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Snake Vs Scorpion Video: భూమిపై ప్రకృతిలో జరిగే జీవరాశుల వింతకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాముల వీడియోను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని విషపూరితమైన పాములు, ఇతర జీవులపై దాడి చేస్తున్న సందర్భంలో తీసిన వీడియోలు కూడా వైరల్ అవుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటి అరుదైన ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది.. ప్రాణాంతక విషమున్న ఒక నల్ల తేలు.. పాము దాడికి సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
ఈ వైరల్ వీడియో వివరాల్లోకి వెళితే.. చీకట్లో ఇసుక నేలపై ఒక భారీ నల్ల తేలు తన కొండిని పైకెత్తి దాడి చేసేందుకు సిద్ధంగా ఉండడం మీరు ఈ వీడియోలో చూడోచ్చు.. అయితే, దానికి అతి సమీపంలోనే ఉన్న ఒక పాము ఏమాత్రం బెదరకుండా తేలు దగ్గరికి వెళ్లడం మీరు క్లియర్‌గా గమనించవచ్చు.. క్షణాల వ్యవధిలోనే పాము.. తేలుపైకి దూసుకెళ్లి.. దాన్ని చుట్టుముట్టేసేందుకు ప్రయత్నించడం మీరు చూడోచ్చు.. తేలు కూడా ఏమాత్రం తగ్గకుండా తన బలమైన పంజాలతో పామును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు.
రెండు విష జీవుల మధ్య జరిగిన ఈ ఘటన చూస్తున్న వారికి తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది.. పాము శరీర బలం.. తేలు పదునైన కొండితో దాడి చేసుకోవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ చిన్నపాటి వీడియో క్లిప్‌ను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ దాదాపు 90 లక్షలకు పైగా వీక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేలాది మంది లైకులు చేసిన్నట్లు తెలస్తోంది..
సాధారణంగా పాములు కీటకాలు.. చిన్న సరీసృపాలను వేటాడుతూ కనిపించడం మీరు చూస్తూ ఉంటారు.. అయితే, తేలు వంటి విషపు కొండి.. కలిగిన జీవులతో తలపడటం చాలా అరుదుగా చూస్తున్నామని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ప్రకృతిలో బలవంతుడిదే రాజ్యం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది.