SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బంగారం, వెండి కాదు.. తన ఎముకలతోనే ఆభరణాలు చేయించుకున్న ట్రాన్స్‌జెండర్!

Viral News: ఓ ట్రాన్స్‌జెండర్ తనకు సర్జరీ సమయంలో కట్ చేసిన ఎముకలతో చెవిపోగులు చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇవి విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 14:17 IST | Updated: Nov 26, 2026, 14:19 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Telugu Viral News: సాధారణంగా ఆభరణాలు అనగానే బంగారం, వెండి, వజ్రాలు లేదా విలువైన రత్నాలు మనందరికీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించి.. తన సొంత ఎముకలతోనే చెవిపోగులు తయారు చేయించుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా  చేసింది.. వినడానికి కాస్త వింతగా.. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది వంద శాతం నిజం.. అయితే, ఎందుకు ఆ యువతి ఇలాంటి పని చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టెక్సాస్ ప్రాంతంలో నివసిస్తున్న 40 ఏళ్లు కలిగిన ఆబ్రే ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ.. పూర్తిస్థాయిలో స్త్రీ రూపాన్ని పొందడానికి ఆమె ఇటీవల ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ చేయించుకున్నారు.. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఆమె ముఖంలోని పలు భాగాల నుంచి కొన్ని చిన్నచిన్న ఎముక ముక్కలను, కణజాలాన్ని తొలగించారట..

సాధారణంగా ఆపరేషన్ తర్వాత తొలగించిన శరీర భాగాలను ఆసుపత్రి వారు బయట పారేస్తూ ఉంటారు. అయితే, ఈ సమయంలోనే ఆబ్రే మాత్రం అందుకు భిన్నంగా ఆలోచి ఒక నిర్ణయం తీసుకుంది... తన జీవితంలో అతిపెద్ద మార్పునకు సాక్ష్యంగా నిలిచిన ఆ ఎముక ముక్కలను తనే తీసుకోవాలనుకుంది.. వైద్యుల అనుమతి తీసుకుని.. ఆబ్రే ఆ ఎముక భాగాలను ఎంతో జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నారట..

కొంతకాలం తర్వాత.. వాటిని కేవలం పెట్టెలో దాచుకోవడం కంటే నిత్యం తనతోనే ఉండేలా ఆభరణాలుగా చేయించుకుంటే బాగుంటుందనే ఆలోచన ఆమెకు వచ్చిందట.. వెంటనే  రెడిట్ సోషల్ మీడియాలో ఒక ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌ను సంప్రదించారట. ఆబ్రే చెప్పింది అర్థం చేసుకున్న ఆ డిజైనర్.. అత్యంత నైపుణ్యంతో ఆ ఎముక ముక్కలను శుభ్రపరిచి.. అందమైన చెవిపోగులుగా తయారు చేశారు.

తాజాగా ఆబ్రే ఈ చెవిపోగుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కొద్ది రోజులే ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ వచ్చాయి. అంతేకాకుండా.. తన దగ్గర ఇంకా కొన్ని ఎముక ముక్కలు మిగిలి ఉన్నాయని.. వాటితో త్వరలోనే ఒక నెక్లెస్ కూడా తయారు చేయించుకోవాలని అనుకుంటున్నాని.. ఆమె వెల్లడించారు. ఈ ఆభరణాలు తనకు కేవలం ఫ్యాషన్ వస్తువులు మాత్రమే కావని.. తన ఆత్మవిశ్వాసానికి, కొత్త జీవితానికి ప్రతీకలని ఆమె తెలిపారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES