Telugu Viral News: మనిషి అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించడం చాలా కష్టం.. జీవితాంతం కష్టపడినా దక్కని సంపద.. కొన్నిసార్లు అనుకోని విధంగా ఒక్క క్షణంలోనే పొందుతూ ఉంటారు.. సరిగ్గా ఇలాంటి అద్భుతమే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ జీవితంలో జరిగిందంటే నమ్ముతారా?. సముద్ర తీరంలో సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెకు దొరికిన ఓ వింత వస్తువు.. ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసేసింది.
థాయ్‌లాండ్‌లోని నఖోన్ సీ తమ్మరత్ సముద్ర తీర ప్రాంతంలో నివసించే.. 49 ఏళ్ల సిరిపోర్న్ న్యూమ్రిన్ రోజు చేసే పనుల్లో భాగంగా బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారట.. ఆ సమయంలో ఇసుకలో ఏదో వింత ఆకారంలో ఉన్న గట్టి ముద్ద ఆమెకు కనిపించిందట.. దగ్గరకు వెళ్లి చూడగా.. దాని నుంచి చేపల వాసన వచ్చిందట.. ఏదో విలువైన లేదా వినియోగించుకునే వస్తువు అయి ఉంటుందనే ఆలోచనతో ఆమె దానిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్లారట..
ఇంటికి చేరుకున్న తర్వాత ఆ వస్తువు ఏమిటో తెలుసుకోవడానికి సిరిపోర్న్ తన ఇరుగుపొరుగు వారిని పిలిచి అందరికీ చూపించారట.. వారిలో ఒకరు దానిని చెక్ చేసి.. అది సాధారణ వస్తువు కాదని.. అత్యంత అరుదైన తిమింగలం వాంతి అని గుర్తించారట. శాస్త్రీయ పరిభాషలో దీనిని అంబర్‌గ్రిస్ అని పిలుస్తారట. ఆ ముద్ద చూడడానికి 24 అంగుళాల పొడవు ఉందట.. ఇది ఇంటర్నెషనల్ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1.86 లక్షల పౌండ్లు ఉంటుందట.. అయితే, ఇది మన భారత కరెన్సీలో దాదాపు రూ. 1.8 కోట్లు ఉంటుందని సమాచారం.
స్పెర్మ్ వేల్ జాతి తిమింగలాల జీర్ణవ్యవస్థలో.. ఈ మైనం లాంటి పదార్థం సహజంగా ఉత్పత్తి అవుతుందట.. సముద్రంలో తేలియాడుతూ తీరానికి కొట్టుకొచ్చే.. ఈ అంబర్‌గ్రిస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉందట.. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ఖరీదైన పెర్ఫ్యూమ్‌ల తయారీలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారట.. పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువ కాలం పాటు నిలిచి.. ఉండేలా చేసేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుందని సమమాచారం. అందుకే దీనిని సీ గోల్డ్‌గా కూడా పిలుస్తారట.